పబ్‌జి ఆడండి, రూ.14 కోట్ల ప్రైజ్ మనీ గెలవండి
పబ్‌జి ప్లేయర్లకు అదిరిపోయే వార్తను టెన్‌సెంట్ గేమ్స్ అందించింది . దాదాపు రూ.14 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. టెన్‌సెంట్ గేమ్స్ తాజాగా ‘పబ్‌జి మొబైల్ క్లబ్ ఓపెన్ 2019’ ఈవెంట్‌ను
పబ్‌జి ప్లేయర్లకు అదిరిపోయే వార్తను టెన్‌సెంట్ గేమ్స్ అందించింది . దాదాపు రూ.14 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. టెన్‌సెంట్ గేమ్స్ తాజాగా 'పబ్‌జి మొబైల్ క్లబ్ ఓపెన్ 2019’ ఈవెంట్‌ను ప్రకటించింది. ఇది ఏడాది మొత్తం నడిచే ఈవెంట్. ఇందులో ప్రో, సెమీ ప్రో టీమ్స్ ఉంటాయి. ఇవి రెండూ ప్రైజ్ మనీ కోసం పోటీపడతాయి. పబ్‌జి మొబైల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఈవెంట్.

ఇదిలా ఉంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా యువత భవిష్యత్ నాశనం చేస్తున్న ఈ ఆన్ లైన్ గేమ్ బ్యాన్ చెయ్యండి మహా ప్రభో అని తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా , ఈ గేమ్ మాత్రం రోజురోజుకీ వ్యసనంలా మారిపోతుంది. మరి ఇప్పుడు రూ.14 కోట్ల ప్రైజ్ మనీ అంటూ కంపెనీ ముందుకొచ్చింది. దీని ప్రాసెస్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

2019.... ఈ గేమింగ్ పోటీ
ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ పబ్జీని నిర్వహించే టెన్‌సెంట్ గేమ్స్.. పబ్జీ మొబైల్ క్లబ్ ఓపెన్ 2019ను ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో ఏడాది పాల్గొనాలి. గెలిచినవారికి 2 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. అంటే మన భారత కరెన్సీలో రూ.14కోట్లు. పబ్జీ మొబైల్ క్లబ్ ఓపెన్ 2019 ఈవెంట్ ఏడాది పాటు జరుగుతుంది.

మార్చి 8వ తేదీ నుంచి
ఈ ఈవెంట్‌లో పాల్గొనదలచినవారికి మార్చి 8వ తేదీ నుంచి ఎంట్రీకి అవకాశం ఇచ్చారు. మార్చి 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌లు ఉంటాయని ప్రకటించింది టెన్ సెట్ కంపెనీ ప్రకటించింది. ఆన్ లైన్ గేమ్ ను ఇంత పెద్ద ప్రైజ్ మనీతో.. ఈవెంట్ నిర్వహించటం ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం అంటున్నారు.

10 రీజియన్‌లో
ఈ ఈవెంట్‌లో ప్రో ప్లేయర్లు.. సెమీ ప్రో ప్లేయర్లు పాల్గొనవచ్చునని ప్రకటించారు. ప్రపంచంలోని 10 రీజియన్‌లో ఈ గేమ్ ఆడేందుకు అవకాశం ఉంది. ఏషియన్ మొత్తాన్ని ఓ రీజియన్ గా ఎంపిక చేశారు.

14 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ
మొదటి రిజియన్ వారీగా పోటీలు నిర్వహిస్తారు. వీళ్లందరినీ కలిపి ఓ గేమ్ పెడతారు. అందులో గెలిచిన వారిని విజేతగా ప్రకటిస్తారు. మొత్తం 14 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని విడతల వారీగా.. అందజేస్తారు. ఎంట్రీ లెవల్ నుంచి క్యాష్ ప్రైజ్ లు ఉంటాయి.

అఫిషియల్ వెబ్‌సైట్
బిగ్గెస్ట్ చికెన్ డిన్నర్ దక్కిన వారు ఈ పోటీలో విజేతలు కానున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్లు గేమ్ అఫిషియల్ వెబ్‌సైట్ www.pubgmobile.com ద్వారా నమోదు చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది.

ప్లేయర్లకు ప్లాటినం ర్యాంక్
ఒక పక్క ఈ గేమ్ ఆడకుండా యువతను కాపాడాలి అని భావిస్తుంటే ఈ ఆటపై మరింత ఆసక్తి పెంచేలా కంపెనీ 14 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటిస్తే ఇక ఈ గేమ్ ఆడకుండా ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి. అయితే ప్లేయర్లకు ప్లాటినం ర్యాంక్ ఉండాలి. తక్కువ వయసున్న ప్లేయర్లు ఆడేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.


Click it and Unblock the Notifications








