PUBG మొబైల్ గేమ్ తిరిగి రానున్నది!! ఇది ఎంతవరకు నిజం??
ఇండియాలో అధిక జనాదరణ పొందిన మొబైల్ గేమ్ లలో ఒకటి PUBG మొబైల్. దీనిని ఇటీవల భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో ఈ మొబైల్ గేమ్ ను తిరిగి తీసుకురానున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గేమ్‌ప్లే నేచర్, డేటా భద్రత వంటి మరిన్ని కారణాల దృష్ట్యా ఈ గేమ్ ను నిషేధించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీని మీద నిషేధం వచ్చిన వెంటనే PUBG కార్పొరేషన్ టెన్సెంట్‌తో విడిపోయి నిషేధాన్ని ఎత్తివేయవచ్చని అందరూ భావించారు. కానీ అక్టోబర్ 30 నుంచి ఇండియాలో దీని సర్వర్లు పూర్తిగా మూసివేయబడ్డాయి. టెక్ క్రంచ్ నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం ఇప్పుడు 2020 చివరి నాటికి భారతదేశంలో PUBG మొబైల్ తిరిగి ప్రారంభించాలి అని దృష్టి సారిస్తున్నట్లు సూచిస్తుంది.

PUBG మొబైల్ గేమ్ తిరిగి రావడం సాధ్యమేనా?
టెక్ క్రంచ్ సంస్థ భారతదేశంలోని డేటాను హోస్ట్ చేస్తూ గ్లోబల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లతో చురుకుగా చర్చలు జరుపుతున్నట్లు నివేదించింది. ఈ సంవత్సరాంతానికి ఇండియాలో PUBG మొబైల్ గేమ్ ను తిరిగి తీసుకురావడం గురించి కొన్ని ప్రముఖ స్ట్రీమర్లకు తెలియజేసింది. ప్రస్తుతానికి PUBG కార్పొరేషన్ నుండి ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటనలు ఏవి కూడా విడుదల కాలేదు కాని దీనికి సంబందించిన వార్తలను అధికారికంగా ‘ఈ వారంలోనే' చూడవచ్చు.

PUBG మొబైల్ గేమ్ ఎందుకు బ్యాన్ చేసారు?
వినియోగదారుల డేటా భద్రత కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం PUBG మొబైల్‌తో పాటు అనేక ఇతర చైనా యాప్ లను నిషేధించింది. కంపెనీ స్థానిక డేటా సర్వర్‌ను సెటప్ చేసిన తర్వాత ఈ సమస్య పరిష్కరించబడుతుంది. కానీ చాలా నివేదికలు గేమ్ యొక్క స్వభావంతోనే పెద్ద సమస్య ఉందని ప్రభుత్వానికి సూచించాయి. చైనాలో PUBG మొబైల్‌ను ఎప్పుడూ లాంచ్ చేయడానికి అనుమతించలేదు ఎందుకంటే ఇది ‘హింసను' వ్యాపిస్తుందని ప్రభుత్వం భావించింది. ఇదే కారణాన్ని భారత ప్రభుత్వం కూడా చెబుతోంది. ఈ ఆందోళనను దక్షిణ కొరియా కంపెనీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

FAUG గేమ్ vs PUBG మొబైల్ గేమ్
భారతదేశంలో PUBG మొబైల్ గేమ్ ను పబ్లిసిటీ చేయడానికి రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ మరియు పేటిఎమ్ వంటి కొన్ని పెద్ద సంస్థలతో PUBG సంస్థ అప్పటిలో చాలా చురుకుగా చర్చలు జరిపింది. PUBG సంస్థ ఇప్పటివరకు ఏమీ ధృవీకరించలేదు కనుక ఈ వార్తలను లైట్ గా తీసుకోవాలని మేము సూచిస్తున్నాము. PUBG బ్యాన్ అయిన తరువాత ఇండియాకు చెందిన సంస్థ FAUG అనే కొత్త గేమ్ ను విడుదల చేయనున్నది. దీనికి సంబంచిన టీజర్ ఇప్పటికే విడుదల చేసింది.


Click it and Unblock the Notifications