Home
News

PUBG మొబైల్ అభిమానులకు శుభవార్త!! కొత్త పేరుతో త్వరలోనే లాంచ్ కానున్నది...

PUBG మొబైల్ గేమ్ గురించి ప్రత్యేకంగా తెలపవలసిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం మీద మొబైల్ గేమ్ లో మంచి మార్పును కూడా తీసుకువచ్చింది. అయితే కొన్ని కారణాల వలన ఇండియాలో PUBG మొబైల్ గేమ్ ను బ్యాన్ చేసారు. అయితే ఇప్పుడు ఈ గేమ్ అభిమానులందరికీ కొన్ని శుభవార్తలను తీసుకువచ్చింది. ఈ సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. 'PUBG బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా కమింగ్ సూన్' పేరుతో విడుదలైన పోస్టర్ ను విడుదల చేసింది. గత వారం PUBG మొబైల్ ఇండియా తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ టీజర్‌ను పోస్ట్ చేసింది. ఈ అధికారిక టీజర్ పోస్టర్ లీక్‌ను నిర్ధారిస్తుంది. అయితే లాంచ్ డేట్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

PUBG మొబైల్ ఇండియా అధికారిక పోస్టర్

PUBG మొబైల్ ఇండియా అధికారిక పోస్టర్

PUBG మొబైల్ గేమ్ యొక్క అధికారిక పోస్టర్ లోని వివరాల విషయానికి వస్తే ఇది 'PUBG మొబైల్ ఇండియా బ్యాటిల్ గ్రౌండ్' మొబైల్ ఇండియాగా వస్తున్నట్లు చూపిస్తుంది. PUBG మొబైల్ ఇండియా యొక్క సోషల్ మీడియా హ్యాండిల్‌ను కూడా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా మార్చారు. ఈ గేమ్ యొక్క ఫేస్బుక్ హ్యాండిల్ మరియు యూట్యూబ్ పేజీ పోస్టర్ ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా మార్చబడ్డాయి. ట్విట్టర్ హ్యాండిల్ అయితే అలాగే ముందుమాదిరిగానే ఉంది.

PUBG మొబైల్

PUBG మొబైల్ ఇండియాను దేశంలో తిరిగి ప్రారంభించడానికి క్రాఫ్టన్ అన్ని చర్యలు తీసుకోవాలనుకుంటున్నాడనే వాస్తవాన్ని ఖండించడం లేదు. అయితే ఈ ప్రయోజనం కోసం గేమ్ యొక్క పేరును మార్చడానికి కూడా కంపెనీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2020 డిసెంబరులో క్రాఫ్టన్ PUBG మొబైల్ ను భారతదేశానికి తిరిగి తీసుకురావడాన్ని ధృవీకరించే "PUBG మొబైల్ ఇండియా" బ్యానర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది అని గుర్తు చేసుకోవచ్చు.

PUBG డెవలపర్లు

ఇండియాలోని వినియోగదారుల యొక్క డేటాను మరియు ప్రైవసీను లీక్ చేస్తున్నట్లు వంటి సమస్యల దృష్ట్యా PUBG మొబైల్ ఇండియాను 2020 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం నిషేధించిందని గమనించాలి. PUBG మొబైల్ ఇండియా పునప్రారంభం గురించి PUBG డెవలపర్లు ఇంకా అధికారిక ప్రకటన చేయకపోగా PUBG మొబైల్ ఇండియా త్వరలో పేరును మార్చుకొని తిరిగి ప్రారంభించబడుతుందని ఉహాగానాలు చెలరేగుతున్నాయి. లింక్డ్ఇన్లో సంస్థ నిరంతరం ఉద్యోగ జాబితాలను వదులుతున్న కారణంగా చుస్తే కనుక ఈ గేమ్ తిరిగి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
PUBG Mobile India Game Comes With New Name: India Launch Date, New Updates and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X