జనవరి 21 నుంచి PUBG ఇండియా పోటీలు, గెలిచిన వారికి రూ.30 లక్షల బహుమతి

    2019 PUBG మొబైల్ ఇండియా సిరీస్‌ను టెన్సెంట్ గేమ్స్ ఇంకా పీయూబీజీ కార్పొరేషన్‌లు సంయుక్తంగా అనౌన్స్ చేసాయి. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ జనవరి 10 నుంచి ఓపెన్ అవుతాయి. జనవరి 23తో రిజిస్ట్రేషన్స్ ముగుస్తాయి. క్వాలిఫైర్స్ ను జనవరి 21 నుంచి జనవరి 28 మధ్య ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ ప్లే-ఆఫ్స్ ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 24 మధ్య జరుగుతాయి. గ్రాండ్ ఫైనల్ మార్చి 10న జరుగుతుంది.

    రూ.550లోపు ధరలో లభించే ఎయిర్‌టెల్ ప్లాన్స్ పై ఓ లుక్కేయండి

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    ఈ కాంపిటీషన్ లో పాల్గొనాలనుకునే

    ఈ కాంపిటీషన్ లో పాల్గొనాలనుకునే వారు PUBG ఇండియా అఫీషియల్ వెబ్ సైట్ లోకి లాగిన్ అయి తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ పోటీల్లో గెలుపొందించిన జట్లకు మొదటి బహుమతి క్రింద రూ.30 లక్షలు, రెండవ బహుమతి క్రింద రూ.10 లక్షలు, మూడవ బహుమతి క్రింద రూ.5 లక్షలు లభిస్తాయి. ఇదే సమయంలో ముందు వరసలో నిలిచిన మొదటి 10 టీమ్‌లకు నగదు బహుమతులను నిర్వాహకులు అందజేయనున్నారు.

    బ్యాటిల్ రాయల్ కాన్సెప్ట్‌

    బ్యాటిల్ రాయల్ కాన్సెప్ట్‌ ఆధారంగా అభివృద్థి చేయబడని ప్లేయర్ అన్‌నౌన్ బ్యాటిల్‌గ్రౌండ్స్ (పీయూబీజీ) మొబైల్ గేమ్‌కు స్మార్ట్‌ఫోన్ యూజర్లు బ్రహ్మరథం పడుతోన్న విషయం తెలిసిందే. ఈ గేమ్‌లో భాగంగా 100 మంది ప్లేయర్స్ పారాచూట్ సహాయంతో ఓ నిర్మానుష్య ద్వీపంలోకి ల్యాండ్ అవుతారు ఇక్కడ కొన్ని వెపన్స్ ఇంకా రక్షణ కవచాల సహాయంతో గేమ్ చివరి వరకు వీరు మనుగడ సాగించాల్సి ఉంటుంది.

    ఉత్కంఠభరితంగా సాగిపోయే ఈ జీవన్మరణ పోరాటంలో

    ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిపోయే ఈ జీవన్మరణ పోరాటంలో భాగంగా ప్లేయర్స్ ఒకరినొకరు చంపుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఈ క్రమంలో మంచి టెక్నిక్స్ ఇంకా వ్యూహాలను ఫాలో అయ్యే ప్లేయర్స్ మాత్రమే తమ ఆయుధాలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగగలుగుతారు.

    PUBG గేమ్‌ప్లేలో భాగంగా

    PUBG గేమ్‌ప్లేలో భాగంగా ప్లేయర్స్ గాయాల నుంచి కోలుకునేందుకు అనేక మెడిసన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని తీసుకోవటం ద్వారా వారు 75% వరకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా ప్లేయర్లు 100% వరకు హీల్ అవ్వొచ్చు. అది ఏవిధంగానో ఇప్పుడు తెలుసుకుందాం...

    హెల్త్‌ ఐటమ్స్

    హెల్త్‌ ఐటమ్స్ అనేవి ప్లేయర్ ఆరోగ్యాన్ని ఇన్‌స్టెంట్‌గా రీజనరేట్ చేస్తాయి. దీంతో వారు మరింత యాక్టివ్‌గా తయారవుతారు. మెడ్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, బ్యాండేజ్ ఇలా మూడు రకాల హెల్త్ ఐటమ్స్ PUBG గేమ్‌ప్లేలో భాగంగా యర్స్‌కు అందుబాటులో ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

    మెడ్ కిట్

    PUBG గేమ్‌ప్లేలో భాగంగా మెడ్ కిట్ అనేది బెస్ట్ హీలింగ్ ఐటమ్‌గా గుర్తింపుతెచ్చుకుంది. ఈ మెడిసన్‌‌ను తీసుకున్న 8 సెకన్లలోపే 100% ఆరోగ్యంతో ప్లేయర్ రీస్టోర్ కాబడతాడు.

    ఫస్ట్ ఎయిడ్ కిట్

    PUBG గేమ్‌ప్లేలో భాగంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది రెండవ బెస్ట్ హీలింగ్ ఐటమ్‌గా గుర్తింపుతెచ్చుకుంది. ఈ మెడిసన్‌‌ను తీసుకున్నట్లయితే 75% ఆరోగ్యంతో ప్లేయర్ రీస్టోర్ కాబడతాడు.

    బ్యాండేజ్

    PUBG గేమ్‌ప్లేలో భాగంగా ఈ హెల్త్ ఐటమ్ చాలా సులువుగా లభ్యమవుతుంది. ఈ బ్యాండెజ్ అనేది 7 సెకన్లలో 10% ఆరోగ్యాన్ని రీజనరేటర్ చేస్తుంది.

    బూస్టర్ ఐటమ్స్

    బూస్టర్ ఐటమ్స్ అనేవి కొంత సమయం పాటు హెల్త్‌ను రీజనరేట్ చేయగలుగుతాయి. ఇదే సమయంలో యాడెడ్ ఇమ్యూనిటీని కూడా ఇవి ఆఫర్ చేస్తాయి. పెయిన్ కిల్లర్, ఎనర్జీ డ్రింక్, అడ్రినలిన్ సిరంజ్ ఇలా మూడు రకాల బూస్టర్ ఐటమ్స్ PUBG గేమ్‌ప్లేలో భాగంగా ప్లేయర్స్‌కు అందుబాటులో ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

    పెయిన్‌కిల్లర్

    పెయిన్‌కిల్లర్ అనేది ప్లేయర్స్‌కు సంబందించిన బూస్టర్ బార్‌ను 60 శాతం వరకు ఫిల్ చేస్తుంది. ఈ పవర్‌ను 7 సెకన్లలోపు ఉపయోగించుకోవల్సి ఉంటుంది.

    ఎనర్జీ డ్రింక్

    ఈ బూస్టర్ ఐటమ్ చాలా తక్కువ మొత్తంలో ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ అనేవి ప్లేయర్స్‌కు సంబందించిన బూస్టర్ బార్‌ను 60 శాతం వరకు ఫిల్ చేస్తాయి. ఈ పవర్‌ను 4 సెకన్లలోపు ఉపయోగించుకోవల్సి ఉంటుంది.

    అడ్రినలిన్ సిరంజ్

    ఈ బూస్టర్ ఐటమ్ చాలా అరుదుగా దొరుకుతుంది. ఇది ఎక్కువుగా సప్లై క్రాట్స్‌లో దొరుకుతుంది. అడ్రినలిన్ సిరంసెజ్ అనేవి ప్లేయర్స్‌కు సంబందించిన బూస్టర్ బార్‌ను 100 శాతం వరకు ఫిల్ చేస్తాయి. ఈ పవర్‌ను 10 సెకన్లలోపు ఉపయోగించుకోవల్సి ఉంటుంది.

    గేమ్‌ప్లే సమయంలో

    గేమ్‌ప్లే సమయంలో ప్లేయర్ ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి, హెల్త్ ఐటమ్స్‌ను చాలా జాగ్రత్తగా వాడుకోవల్సి ఉంటుంది. ప్లేయర్‌కు సంబంధించిన బ్యాగ్ లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంటుంద కాబట్టి ఇతర స్టఫ్‌తో పాటు హెల్త్ ఐటమ్స్‌ను ఉంచుకునేందుకు కూడా చోటును కల్పించుకోవాలి.

    బూస్టర్ ఐటమ్స్‌తో పోలిస్తే మెడ్ కిట్

    బూస్టర్ ఐటమ్స్‌తో పోలిస్తే మెడ్ కిట్ అలానే ఫస్ట్ ఎయిడ్ కిట్‌లు ఎక్కవు స్పేసును ఆక్రమించేస్తుంటాయి. కాబట్టి వాటిని రెండు లేదా మూడుకు పరిమితం చేసి మిగిలిన స్పేసును బూస్టర్ ఐటమ్స్ కు కేటాయించుకుంటే సరిపోతుంది. ప్లేయర్స్‌కు మైనర్ డామేజీలు సంభవించిన సమయంలో బ్యాండేజెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా చాలా వేగంగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    English summary
    PUBG Mobile India Series 2019 With Rs. 1 Crore Prize Pool Announced.To Know More About Visit telugu.gizbot.com
    Opinion Poll
    X

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more