PUBG Mobile ఇండియా గేమ్ కొత్త వెర్షన్!!! ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా??
భారతదేశంలో ఇటీవల బ్యాన్ చేసిన ప్రముఖ మొబైల్ గేమ్ PUBG మొబైల్ తిరిగి వస్తున్నట్లు PUBG కార్పొరేషన్ ప్రకటించింది. ఇండియా కోసం కొత్తగా రూపొందించిన 'PUBG మొబైల్ ఇండియా' గేమ్ కొత్త వెర్షన్‌ను కంపెనీ ప్రకటించింది. ఏదేమైనా జనాదరణ పొందిన ఈ గేమ్ తిరిగి రానున్న కారణంగా భారత ప్రభుత్వం నుండి ఎటువంటి అడ్డంకులు ఎదురవుతాయో చూడాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) PUBG కార్పొరేషన్ లేవనెత్తిన అన్ని సమస్యలను పరిష్కరిస్తేనే గేమ్ కు సడలింపును పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. డేటాను స్థానికంగా సేవ్ చేయడంతో పాటు PUBG మొబైల్ ఇండియా వెర్షన్‌లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు పత్రికా ప్రకటనలో PUBG కార్పొరేషన్ తెలిపింది.

PUBG మొబైల్‌కు సడలింపును ప్రభుత్వం అనుమతిస్తుందా?
PUBG మొబైల్ భారతదేశానికి తిరిగి రావడాన్ని ప్రభుత్వం చాలా నిశితంగా పరిశీలిస్తుందని కొన్ని నిఘా వర్గాలు తెలిపాయి. ఒక నివేదిక ప్రకారం PUBG మొబైల్ ఇండియా వెర్షన్‌ను ప్రారంభించడానికి PUBG కార్పొరేషన్‌కు మంత్రిత్వ శాఖ ఇంకా అనుమతి ఇవ్వలేదు అని సన్నిత వర్గాలు తెలుపుతున్నాయి. సంస్థ వారు PUBG మొబైల్ గేమ్ కు సంబందించిన అన్ని రకాల ఆందోళనలను పరిష్కరించకపోతే మరియు ఏదైనా సడలింపు ఇవ్వడం కష్టం అని MeitY దగ్గరగా ఉన్న వర్గాలు తెలిపారు.

PUBG కార్పొరేషన్ దృష్టి పెట్టిన రెండు ప్రధాన అంశాలు
భారతదేశంలో తిరిగి ప్రవేశించడానికి PUBG కార్పొరేషన్ రెండు ప్రధాన అంశాలపై ఎక్కువగా దృష్టిని సారిస్తున్నది. ఇందులో మొదటిది డేటా స్థానికీకరణ మరియు భద్రత. మైక్రోసాఫ్ట్ అజూర్‌తో ఇటీవల కుదిరిన భాగస్వామ్యం కారణంగా PUBG కార్పొరేషన్ ఇప్పుడు వినియోగదారుల డేటాను స్థానికంగా నిల్వ చేయగలదు. PUBG కార్పొరేషన్ దృష్టి పెట్టిని రెండవ అంశం గేమ్ ప్లే యొక్క స్వభావం. ఇది మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలను సంతృప్తి పరచడానికి మరియు స్థానిక అవసరాలకు కూడా సరిపోయే విధంగా ఇది గేమ్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు PUBG కార్పొరేషన్ తెలిపింది.

PUBG మొబైల్ ఇండియా లాంచ్ కు వ్యూహాలు
PUBG మొబైల్ ఇండియాను ప్రారంభించటానికి PUBG కార్పొరేషన్ ఎటువంటి ఎత్తులను అవలంబిస్తున్నదో ముందు ముందు చూడవలసి ఉంది. దీని గురించి ఇప్పటికి ఎటువంటి పూర్తి సమాచారం తెలీదు. వెబ్‌లోని వివిధ నివేదికల ప్రకారం ఈ గేమ్ మొదట్లో దేశంలోని ప్రసిద్ధ స్ట్రీమర్‌లకే పరిమితం అవుతాయని సూచిస్తున్నాయి. ఈ గేమ్ ను తిరిగి ప్రారంభించడానికి PUBG కార్పొరేషన్ అవసరమైన అనుమతులు పొందిన తర్వాత PUBG మొబైల్ ఇండియా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. భారత ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో PUBG మొబైల్ మరియు PUBG మొబైల్ లైట్ గేమ్‌లతో పాటు 117 ఇతర చైనా అనువర్తనాలను నిషేధించింది.


Click it and Unblock the Notifications








