గూగుల్ ప్లే స్టోర్‌లోకి PUBG మొబైల్ లైట్, ఉచితం

By Gizbot Bureau
|

నేటి యువత పబ్‌జీ గేమ్‌కు బాగా బానిసయిపోయింది. యువతే కాదు.. స్కూల్ విద్యార్థులు కూడా ఈ గేమ్‌కు బాగా అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆ గేమ్ నుంచి బయటపడాలంటే సప్తసముద్రాలు ఈదినంత పనిచేయాలి. డ్రగ్స్ కన్నా డేంజర్ ఈ పబ్‌జీ గేమ్. దాన్ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ఇండియాలో పబ్‌జీ వీడియో గేమ్‌కు ఫుల్ క్రేజ్ ఉంది.

PUBG Mobile Lite released in India, available for free on Google play store

చిన్న పిల్లల నుంచి యువకుల వరకు అందరూ పబ్ జీ మాయలో పడిపోయారు.ఇండియాలో పబ్‌జీ వీడియో గేమ్ కారణంగా యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర వివాదాస్పదానికి దారితీసింది. దేశంలో పబ్‌జీపై బ్యాన్ చేయాంటూ డిమాండ్‌లు కూడా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పబ్‌జీ క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. పబ్‌జీ ప్రియులు వీడియో గేమ్‌తో కాలక్షేపం చేస్తున్నారు.

 కొత్త వెర్షన్ PUBG మొబైల్ Lite

కొత్త వెర్షన్ PUBG మొబైల్ Lite

దీంతో కంపెనీ కూడా సరికొత్తగా ముందుకు వచ్చింది. పబ్‌జీ వీడియో గేమ్ లవర్స్ కోసం ఇండియాలో కొత్త వెర్షన్ PUBG మొబైల్ Lite రిలీజ్ చేసింది. పేరంట్ కంపెనీ టెన్సెంట్ గేమ్స్ కొత్త లైట్ వెర్షన్ ప్రవేశపెట్టింది. చైనీస్ టెక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం ప్లేయర్ అన్ నౌన్ బాటిల్ గ్రౌండ్స్ (PUBG) PC వెర్షన్ లాంచ్ చేసిన తర్వాత టెన్సెంట్ PUBG మొబైల్ లైట్ వెర్షన్ తీసుకోచ్చింది.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి

గూగుల్ ప్లే స్టోర్ నుంచి

ఈ కొత్త PUBG మొబైల్ లైట్ వీడియో గేమ్‌ యాప్‌ను Google Play యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సైజు 400MB ఉంటుంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లలో (2GB RAM కంటే తక్కువ) ఈజీగా రన్ అవుతుంది. లైట్ వెర్షన్ యాప్ లో యూజర్లకు Map కూడా ఉంది. PUBG mobileతో పోలిస్తే చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. 10 నిమిషాల్లో 60ప్లేయర్స్ కంప్లీట్ చేసేలా డిజైన్ చేశారు.

వీక్ నెట్‌వర్క్ ఉన్నా సరే

వీక్ నెట్‌వర్క్ ఉన్నా సరే

ఈ లైట్ వెర్షన్ లో బెనిఫెట్స్ ఏంటంటే.. వీక్ నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల్లో కూడా గేమ్ ఎలాంటి అంతరాయం లేకుండా ఆడుకోవచ్చు. కొత్తగా జాయిన్ అయ్యే Lite Version పబ్‌జీ ప్లేయర్లకు రకరకాల రివార్డ్సు పొందవచ్చు. కొత్త గేర్లు, వాహనాలను వీడియో గేమ్‌లో ఆయుధాలుగా పొందవచ్చు. కొన్నిరోజుల క్రితమే PUBG మొబైల్ సీజన్ 8 కూడా రిలీజ్ అయింది. ఇందులో విపన్ కస్టమైజేషన్స్, ఔట్ ఫిట్స్, రివార్డులు, కొత్త థీమ్ సహా కొత్త ఫీచర్లు ఉన్నాయి.

 లో ఎండ్ PCల్లో

లో ఎండ్ PCల్లో

PUGB Lite వెర్షన్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవడమే కాకుండా గేమర్లు లో ఎండ్ PCల్లో కూడా ఆడుకోవచ్చు. PUBG మొబైల్ వెర్షన్ కూడా గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో ఉచితంగా అందుబాటులో ఉంది. PUBG Lite నుంచి ప్రొ ప్లేయర్ గా మారాలంటే కొన్ని కీలక సెట్టింగ్స్ తప్పక మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే గేమ్ రన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
PUBG Mobile Lite released in India, available for free on Google play store

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X