గ్రేట్ ఇండియన్ వారియర్‌తో పబ్‌జి‌లోకి ఎక్కిన బాహుబలి

|

ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్ PUBG గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఈ గేమ్ మరింతగా పాపులర్ అయిందే కాని దాని ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. స్నేహితులతో కలిసి ఆన్‌లైన్ యుద్ధరంగంలో పోరాడే ఈ ఆటకు ఇండియాలో ఎంతో ఆదరణ లభిస్తోంది. అయితే ఇప్పుడు ఇది మరింతగా వినియోగదారులను ఆకట్టుకోనుంది. దీనికి కారణం ఇండియాలో సంచలనం సృష్టించిన బాహుబలి సినిమానే.. ఆ సినిమాలోని కాస్ట్యూమ్స్ ఇప్పుడు పబ్‌జి‌లోకి ఎక్కాయి. ఇకపై ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్ PUBGలో మీరు బాహుబలిగా కూడా మారిపోవచ్చు.

 గ్రేట్ ఇండియన్ వారియర్‌తో పబ్‌జి‌లోకి ఎక్కిన బాహుబలి

 

గ్రేట్ ఇండియన్ వారియర్

పబ్‌జీ కూడా తమ ఆన్‌లైన్ యుద్ధరంగంలో పోరాడేందుకు 'బాహుబలి’కి స్థానం కల్పించింది. భారత వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు పబ్‌జీ 'బాహుబలి’ ఔట్‌ఫిట్ (వస్త్రాలంకరణ) అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పబ్‌జీ ఐటం షాప్‌లో 'గ్రేట్ ఇండియన్ వారియర్’ పేరుతో బాహుబలి వస్త్రాలను అందుబాటులోకి తెచ్చింది.

కొనుగోలు చేయాలంటే

కొనుగోలు చేయాలంటే

పబ్‌జీలో ఆసక్తిగల వినియోగదారులు దీన్ని కొనుగోలు చేయాలంటే 1,260 UC అంటే దాదాపు నలభై రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు Get it now ఆప్షన్ నొక్కినట్లయితే 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే సుమారు 945 UCకే బాహుబలి ఔట్‌ఫిట్‌ను పొందవచ్చు. ఈ డిస్కౌంట్ మే 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇందులో రెండు పార్టులు

ఇందులో రెండు పార్టులు

‘The Great Indian Warrior Outfit'. బాహుబలి తరహాలోనే ఇందులో రెండు పార్టులు ఉన్నాయి. ఒకటి ఆర్మడ్ ఔట్ ఫిట్ కాగా రెండోది హెడ్ గేర్. పబ్ జీ గేమ్ యూజర్లు గేమ్ షాప్ సెలక్షన్ నుంచి తమకు నచ్చిన పార్ట్ ను ఎంపిక చేసుకోవచ్చు. బాహుబలి హెడ్ గేర్ ధర 360 UC (Unknown Cash), (చెస్ట్ ఆర్మర్) ఉదర కవచం, మణికట్టు, ఆర్మ్ ప్రొటక్షన్, బాటమ్ వేర్ కావాలంటే 900UC ఖర్చు చేయాల్సి ఉంటుంది. 300 ucలు అయితే మన కరెన్సీలో రూ.9.76 అవుతుంది.

లిమిటెడ్ Period Offer
 

లిమిటెడ్ Period Offer

Head Gear ధరను లిమిటెడ్ Period Offer తో అందిస్తున్నారు. బాహుబలి ఇన్స్ పైరడ్.. గేమ్ లాంచ్ చేయగానే కనిపిస్తుంది. అదొక ఇన్ గేమ్ అడ్వర్టైజింగ్. గేమ్ ప్రారంభంలో.. యూజర్లు 25శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. మొత్తం వారియర్ గేమ్ కొనాలంటే 1,260 UC అవుతుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ మే 15, 2019 వరకే వ్యాలీడ్ ఉంటుంది.

పబ్ జీ వీడియో గేమర్స్

పబ్ జీ వీడియో గేమర్స్

బాహుబలి ఇన్స్ పైరడ్ కాస్టూమ్స్ ను.. మూవీ మేకర్లతో కలిసి క్రియేట్ చేసినవి కావు. రెసిడెంట్ ఎవిల్ ఇన్స్ పైరడ్ కంటెంట్ తో పబ్ జీ మొబైల్ ను ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టారు. పబ్ జీ వీడియో గేమర్స్ ఇండియన్ ఆడియన్స్ టార్గెట్ చేయడం తొలిసారి కాదు.

టెన్సెంట్ గేమ్స్ కూడా ఇండియా ఇన్స్ పైరడ్ ఔట్ ఫిట్స్ ను ఈ గేమ్ లో రిలీజ్ చేసింది. 2018లో పబ్ జీ మొబైల్ ట్రేడిషనల్ కుర్తా, పైజామాను దీపావళి సందర్భంగా ప్రవేశపెట్టింది. అంతేకాదు.. ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ జెర్సీలు, ఔట్ ఫిట్స్ ను కూడా పబ్ జీ గేమర్లు రిలీజ్ చేశారు.

చెడు ప్రభావానికి గురవుతున్నారని

చెడు ప్రభావానికి గురవుతున్నారని

PUBG గేమ్ కారణంగా చెడు ప్రభావానికి గురవుతున్నారని, ఇండియాలో వెంటనే ఈ గేమ్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ లు వెల్లువెత్తాయి. అయినప్పటికీ పబ్ జీ గేమ్ లవర్స్ దీన్ని వదిలిపెట్టడం లేదు. బ్యాన్ చేసినప్పటికీ దాన్ని వదలడం లేదంటే జనాల్లోఈ గేమ్ ఎంతగా పాతుకుపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
PUBG gets Baahubali-inspired ‘Great Indian Warrior’ outfit: Here's the price and how to get it

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X