PUBG గేమ్ మళ్లీ కొత్త ఫార్మాట్‌లో! మీ ఫోన్ లో డౌన్‌లోడ్ చేయడం ఎలా?
PUBG న్యూ స్టేట్ చాలా కాలం నిరీక్షణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరి కోసం విడుదల చేయబడింది. ఆండ్రాయిడ్ ఫోన్ లను ఉపయోగిస్తున్న వినియోగదారుల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి గేమ్ ఇప్పటికే అందుబాటులో ఉండగా iOS వినియోగదారుల కోసం ఈ గేమ్ విడుదల ఇంకా జరగలేదు. ఈ కొత్త గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నప్పటికీ సర్వర్ సమస్య కారణంగా వినియోగదారులు దీన్ని ఆడడానికి వీలులేదు. తాజా అప్‌డేట్‌లో భాగంగా PUBG న్యూ స్టేట్ 11:30 am IST (భారత ప్రామాణిక కాలమానం) నుండి అందరికీ అందుబాటులో ఉంటుందని గేమ్ డెవలపర్ ప్రకటించారు. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

PUBG న్యూ స్టేట్ గేమ్ ను ఆడడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది ప్లేయర్‌లు ఇప్పటికే కొత్త అప్‌డేట్‌ని స్వీకరించి ఉండడమే కాకుండా బ్యాటిల్ రాయల్ గేమ్‌ని డౌన్‌లోడ్ చేసి ఉండాలి. మీరు ఇంకా కొత్త అప్‌డేట్‌ను అందుకోకుంటే కనుక మరికొంత సమయం వేచి ఉండవలసి ఉంటుంది. క్రాఫ్టన్ PUBG న్యూ స్టేట్‌ను దశలవారీగా విడుదల చేస్తుంది కావున రాబోయే కొద్ది గంటల్లో గేమ్ అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Android & iOS వినియోగదారుల కోసం PUBG న్యూ స్టేట్ డౌన్‌లోడ్ లింక్
ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారుల కోసం PUBG న్యూ స్టేట్ గేమ్ ఈరోజు నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కొంతమంది ఇప్పటికే గేమ్‌ను డౌన్‌లోడ్ చేసి ఉండవచ్చు కానీ మరికొందరు దీని యొక్క డౌన్‌లోడ్ లింక్ కోసం వేచిచూస్తూ ఉండవచ్చు. మీరు కొత్త PUBG గేమ్‌ని డౌన్‌లోడ్ చేయలనుకుంటే కనుక కింద తెలిపే విధానాన్ని అనుసరించండి.
Android వినియోగదారుల కోసం
స్టెప్ 1: ముందుగా Google Play స్టోర్‌ని ఓపెన్ చేయండి.
దశ 2: PUBG న్యూ స్టేట్ గేమ్ కోసం సెర్చ్ చేయండి.
దశ 3: తరువాత ఇన్‌స్టాల్ ఎంపికపై క్లిక్ చేయండి.
దశ 4: ఇది భారీ గేమ్ కాబట్టి ఇన్‌స్టాలేషన్‌కు కొంత సమయం పడుతుంది.
ఐఫోన్ వినియోగదారుల కోసం
దశ 1: Google Play స్టోర్‌ని ఓపెన్ చేయండి.
దశ 2: PUBG న్యూ స్టేట్ గేమ్ కోసం సెర్చ్ చేయండి.
దశ 3: ఇన్‌స్టాల్ ఎంపికపై క్లిక్ చేయండి.

గుర్తుంచుకోవలసిన చిట్కాలు
చిట్కా 1: ఇన్‌స్టాలేషన్‌కు ముందు మీ ఫోన్‌ని స్థిరమైన WiFi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయండి
చిట్కా 2: ఇది భారీ ఫైల్ అయినందున మీ డివైస్ లో తగినంత స్థలాన్ని ఉంచండి.
చిట్కా 3: కొత్త అప్ డేట్ ను ఇన్‌స్టాల్ చేసే ముందు సిస్టమ్ అవసరాలను తనిఖీ చేయండి. అన్ని ఫోన్‌లు PUBG న్యూ స్టేట్ గేమ్‌ని అమలు చేయలేవు.

PUBG న్యూ స్టేట్ గేమ్ కోసం సిస్టమ్ యొక్క అవసరాలు
RAM: 2GB లేదా అంతకంటే ఎక్కువ
OS: ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే ఎక్కువ
GL 3.1 లేదా అంతకంటే ఎక్కువ / Vulkan 1.1 లేదా అంతకంటే ఎక్కువ
CPU: 64-బిట్ (ABI ఆర్మ్64 లేదా అంతకంటే ఎక్కువ).


Click it and Unblock the Notifications