Just In
- 9 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 14 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 17 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్‌లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
PUBG మత్తులో జగత్తు, చదువుల పై ప్రభావం!
పరీక్షల వేళకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎగ్జామ్స్ ఫీవర్ నెలకుంది. ఈ తరుణంలో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపి పరీక్షలకు సన్నద్థం చేసేందుకుగాను దిల్లీ వేదికకగా పరీక్ష-పే-చర్చ 2.0 పేరుతో ఓ చర్చా గోష్టి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాన నరేంద్ర మోదీ విద్యార్థులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలను చేసారు. పరీక్షలు అనేవి జీవితంలో ఓ భాగం తప్ప, అవే జీవితం కాదని, కాబట్టి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి ప్రధానితో మాట్లాడుతూ తన కొడుకు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడిపోయి చదువులను పక్కనపెట్టేస్తున్నాడంటూ వాపోయింది. వెంటనే స్పందించిన ప్రధాని అతను పీయూబీజీ ఆటగాడా అంటూ చమత్కరించారు. దీంతో ఒక్కసారిగా సభాప్రాంగణం నువ్వులతో మారుమోగిపోయింది.

ప్రధాని మోదీ అన్నట్లుగానే PUBG గేమ్
ప్రధాని మోదీ అన్నట్లుగానే PUBG గేమ్ ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచాన్ని శాసిస్తోంది. దేశవ్యాప్తంగా అత్యధికశాతం మంది యువత ఈ ఆటలో మునిగితేలుతున్నారు. చిన్న, పెద్ద అని తేడాలేకుండా ప్రైమరీ స్కూల్ నుంచి కళాశాల విద్యార్థుల వరకు ఆ ఆటకు బానిస అవుతున్నారు. గేమింగ్ ప్రపంచాన్ని ఇంతలా ఉర్రూతలూగిస్తోన్న ఈ గేమ్ గురించి 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్’
మొబైల్ గేమింగ్ విభాగంలోకి పెను సంచలనంలా దూసుకొచ్చిన 'ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్' (పీయూబీజీ), ఇప్పుడు ప్రపంచమంతా వైరల్ అవుతోంది. ఈ రియల్ టైమ్ మల్టీప్లేయర్ షూటర్ గేమ్‌ను స్మార్ట్‌ఫోన్ యూజర్లు అమితంగా ఇష్టపడుతున్నారు. 2017లో లాంచ్ అయిన ఈ గేమ్‌ను పీయూబీజీ కార్పొరేషన్ అలానే చైనా టెన్సెంట్ గేమ్స్ సంయుక్తంగా అభివృద్థి చేసాయి.

ప్లేయర్ అన్‌నౌన్ గోస్ట్ హోటల్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఆధారంగా
ప్లేయర్ అన్‌నౌన్ గోస్ట్ హోటల్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఆధారంగా అభివృద్థి చేయబడిన ఈ గేమ్‌లో కొత్త ఫీచర్లతో పాటు కంట్రోల్స్‌ను ఇంక్లూడ్ చేసింది. ఈ రసవత్తర గేమ్‌లో పారాచ్యూట్ ల్యాండింగ్, ఆర్మర్స్ ఇంకా వెపన్స్‌ను కలెక్ట్ చేయటం, ఎనిమీల వ్యూహాల నుంచి తప్పించుకోవటం, ఎదురుదాడి చేయటం వంటి వ్యూహ ప్రతివ్యూహాలు ఈ గేమ్‌లో అందుబాటులో ఉంటాయి.

PUBG అనేది ఒక ఆన్‌లైన్ గేమ్
PUBG అనేది ఒక ఆన్‌లైన్ గేమ్, ఈ గేమ్‌లో మొత్తం 100 మంది ఆటగాళ్లు ఉంటారు. వీరంగా పారాచ్యూట్ సహాయంతో ఓ నిర్మానుష ద్వీపంలోకి నిరాయుధులగా చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తరువాత ఆయుధాలతో పాటు ఇతర వస్తువులను ఆటగాళ్లు వెతుక్కోవల్సి ఉంటుంది. ప్రతికొద్ది నిమిషాలకు గేమ్ మ్యాప్ కృశించుకుపోతుంటంతో ఎప్పటికప్పుడు కొత్త స్థావరాలకు వెతుక్కోవల్సి ఉంటుంది. ఈ మధ్యలో ప్రత్యర్థులను చంపుకుంటూ ముందుకు సాగవల్సి ఉంటుంది. ఆటలో అందరిని తుది ముట్టించి చివరి వరకు ప్రాణాలను నిలబెట్టుకన్న వారు ఈ ఆటలో విజేతలుగా నిలుస్తారు.

ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో
ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న PUBG గేమింగ్ యాప్ ను ఇప్పటి వరకు 20 కోట్ల మంది యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఓ అంచనా. వీరిలో 3 కోట్ల మంది యూజర్లు రోజు ఈ గేమ్ ను ఆడుతూనే ఉన్నారట. తాజాగా ఈ గేమ్ లకు పలు అప్ డేట్ లను కూడా టెన్సెంట్ గేమ్స్ విడుదల చేసింది.

PUBG గేమ్‌లో అనేక అడ్వెంచరస్ టాస్క్స్
PUBG గేమ్‌లో అనేక అడ్వెంచరస్ టాస్క్స్ అందుబాటులో ఉండటంతో చాలా మంది యూజర్లు బ్లుస్టాక్, నాక్స్ ప్లేయర్ వంటి థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్స్‌ను ఉపయోగించుకుని ఈ గేమ్‌ను తమతమ పీసీల్లో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. పీసీలో గేమ్ ఆడుతున్నపుడు కీబోర్డ్ ఇంకా మౌస్ ద్వారా గేమ్‌ప్లేను ఎన్‌హాన్స్ చేసుకునే వీలుంటుంది. థర్డ్ పార్టీ ఎమ్యులేటర్స్ ద్వారా గేమ్ ఆడుతున్నపుడు పలు ఇబ్బందులు తలెత్తుతోన్న నేపథ్యంలో టెన్సెంట్ గేమ్స్ Tencent Gaming buddy పేరుతో అఫీషియల్ పీయూబీ ఎమ్యులేటర్‌ను ఈ మధ్య మార్కెట్లోకి తీసుకువచ్చింది.

AOW ఇంజిన్ ఆధారంగా
AOW ఇంజిన్ ఆధారంగా స్పందించగలగే ఈ పీయూబీ ఎమ్యులేటర్ పీయూబీజీ మొబైల్ వెర్షన్‌ను పీసీలో ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ ఎమ్యులేటర్ పీసీకి సంబంధించిన కీబోర్డ్ అలానే మౌస్‌లను ఆటోమెటిక్‌గా డిటెక్ట్ చేయటంతో పాటు పీసీలో రిసోర్సులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ స్మూత్ ఇంకా లాగ్-ఫ్రీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుంది.

PUBG గేమ్ విద్యార్థుల చదువులపై కూడా
PUBG గేమ్ విద్యార్థుల చదువులపై కూడా ప్రభావం పడుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్‌జి గేమ్‌ను బ్యాన్ చేయాలని జిల్లా విద్యాధికారులకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. గుజరాత్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ స్కూల్స్‌లలో విద్యార్థులు పబ్‌జి గేమ్ ఆడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ గేమ్‌కు విద్యార్థులు బానిస అవుతున్నారని, కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470