పూణే చిన్నోడి అద్భుత ఆవిష్కరణ !!

Posted By: Super

పూణే చిన్నోడి అద్భుత ఆవిష్కరణ !!

 

పూణేకు చెందిన 14 సంవత్సరాల బాలుడు తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. 8వ తరగతి చదువుతున్న విఘ్నేష్ సందురరాజన్ ఇండియన్ ఫేస్‌బుక్ తరహా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను రూపొందించాడు. Zettaconnect.co.in పేరుతో ఫేస్‌బుక్ పీచర్లను ఒదగి ఉన్న ఈ నెట్‌వర్కింగ్ వ్యవస్థను జనవరి 21న సుందరరాజన్ ఆవిష్కరించాడు. సీ, హెచ్టీఎమ్ఎల్, పీహెచ్‌పీ కంప్యూటర్ భాషలను ఈ సైట్ నిర్మాణంలో ఉపయోగించినట్లు విఘ్నేష్ పేర్కొన్నాడు. తను దాచుకున్న పాకెట్ మనీ మొత్తంతో సైట్‌ను రిజిస్టర్ చేయించినట్లు ఈ పూణే చిచ్చరపిడుగు వెల్లడించాడు. ఈ సైట్ ద్వారా మిత్రులతో ఛాటింగ్ నిర్విహించుకోచ్చు అదేవిధంగా ఫోటోలతో పాటు వీడియోలను అప్‌లోడ్ చేసుకునే సౌలభ్యత, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ సైట్‌లో చేరిన ప్రస్తుత సభ్యుల సంఖ్య 26.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot