Home
News

నిజమని నమ్మి వాట్సాప్‌ గ్రూప్‌లో జాయిన్‌ అయితే.. రూ.1.2 కోట్లు దోచుకున్నారు..!

సైబర్‌ నేరాలు, మోసాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. అయితే గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో జరుగుతున్న మోసాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఫలితంగా అనేక మంది లక్షల రూపాయలను కోల్పోతున్నారు. తాజాగా ఓ డాక్టర్‌ ఏకంగా రూ.1.2 కోట్లు (Pune Doctor Loses RS1.2 Crore) కోల్పోయారు. ముఖ్యంగా ఈ తరహా మోసాలు సోషల్‌ మీడియా ఆధారంగా జరుగుతున్నాయి. పూర్తి వివరాలు.

పూణేకు చెందిన డాక్టర్‌కు జులై నెలలో ఒక మెసెజ్‌ వచ్చింది. వాట్సాప్‌ గ్రూప్‌లో జాయిన్‌ కావాలంటూ పంపిన రిక్వస్ట్‌ అది. అయితే వెంటనే ఆ వాట్సాప్‌ గ్రూప్‌లో జాయిన అయ్యారు. అనంతరం అడ్మిన్‌ సహా ఇతర సభ్యులు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులతోపాటు అధిక లాభాలు వస్తున్నట్లు అందులో చర్చించుకుంటున్నారు. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన వేదికని నమ్మిన డాక్టర్.. వారు చెప్పిన ట్రేడింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

pune doctor loses rs 1 2 crore in online trading scam

అయితే సదరు వాట్సాప్‌ గ్రూప్‌లోని వ్యక్తులు చెప్పిన మోసపూరిత ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా సుమారు 40 రోజులపాటు 35 లావాదేవీలు నిర్వహించారు. యాప్‌ ద్వారా వివిధ బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేశారు. అంటే మొత్తంగా ఆ పూణే డాక్టర్‌ రూ.1.22 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే ప్రతి లావాదేవీ కూడా ఆ నకిలీ యాప్‌లో పెట్టుబడుల రూపంలో కనిపించినట్లు తెలుస్తోంది.

పూణే డాక్టర్‌ మొత్తంగా రూ.10.26 కోట్లు లాభాలు సంపాదించినట్లు ఆ యాప్‌లో చూపించింది. దీంతో ఆ నగదును తన ఖాతాలకు బదిలీ చేసుకొనేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆ నకిలీ యాప్‌ నిర్వాహకులు ఆ నగదును విత్‌డ్రా చేసేందుకు 5 శాతం డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆ నగదు మొత్తాన్ని బదిలీ చేయడం లేదా విత్‌డ్రా చేసుకొనేందుకు వీలు లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన డాక్టర్‌.. సదరు ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం అడ్రస్‌ కావాలని కోరారు. దీనిపై స్పందించిన నేరగాళ్లు ఢిల్లీ అడ్రస్‌ ఇచ్చారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన డాక్టర్‌ సైబర్ క్రైం హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పూణేలోనే సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియా మరియు ఆన్‌లైన్‌ వేదికల ద్వారా నేరాలు ఎలా జరుగుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన సరైన ఉదాహరణగా భావించవచ్చు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా లాభాలు పొందవచ్చని చెప్పి.. ఏకంగా డాక్టర్‌నే మోసం చేశారు. ఇప్పటికే ఈ తరహా ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
pune doctor loses rs 1.2 crore in stock market fraud full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X