మోడీ గారు.. మా ఇంటి పక్కన ఏలియన్ సంచరిస్తోంది, కాపాడండి ?

|

మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.కానీ మనిషి పంపిన ఏ సందేశానికీ ఏలియన్స్ ఇప్పటివరకూ జవాబు ఇవ్వలేదు.మానవుల సందేశాలకు ఏలియన్స్ ఎందుకు స్పందించడం లేదు. అసలు అవి ఉన్నాయా, లేవా? అనే దాని పై డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా జనాలు ఆసక్తిగా వింటుంటారు.కొన్ని చోట్లైతే ఏకంగా ఏలియన్సే కనిపించాయని పుకార్లు షికారు చేశాయి. అయితే తాజాగా పుణెలో గ్రహాంతర వస్తువు కనిపించిదని నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి ఈమెయిల్ పంపాడు ఓ వ్యక్తి.పూర్తి వివరాల్లోకి వెళ్తే...

 

పేటీఎం మాల్‌ 'Happy New Year Sale' : టీవీల పై 50% డిస్కౌంట్పేటీఎం మాల్‌ 'Happy New Year Sale' : టీవీల పై 50% డిస్కౌంట్

ఏలియన్ ఆబ్జెక్ట్ ...

ఏలియన్ ఆబ్జెక్ట్ ...

ఆకాశంలో నుంచి ఏలియన్ ఆబ్జెక్ట్ తమ ఇంటి ముందు కనిపించిందని చెట్ల మధ్య నుంచి వెలుతురు రావడాన్ని తాను గమనించానని ఈమెయిల్ లో రాసాడు .ఆ వస్తువు భూమికి సంబంధించిన సమాచారాన్ని వారి గ్రహానికి చేరవేస్తోందని తెలిపాడు. దీని ఫై విచారణ చేసి తమని కాపాడాలి అని కోరాడు.

స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం...

స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం...

దానిపై స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం ఆ ఈమెయిల్ ను పుణె పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ ఈమెయిల్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ట్రాక్ చేసి ఆ వ్యక్తిని పట్టుకున్నారు.

 ఏలియన్ ఆబ్జెక్ట్ వ్యవహారం తేల్చేందుకు పుణె పోలీసులు...
 

ఏలియన్ ఆబ్జెక్ట్ వ్యవహారం తేల్చేందుకు పుణె పోలీసులు...

ఏలియన్ ఆబ్జెక్ట్ వ్యవహారం తేల్చేందుకు పుణె పోలీసులు మూడు పాటు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆ ఆబ్జెక్ట్‌పై అతడిని పోలీసులు ప్రశ్నిస్తే పొంతన లేని సమాధనం చెప్పాడు.

ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదని స్పష్టమైంది....

ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదని స్పష్టమైంది....

అయితే చివరికి ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదని స్పష్టమైంది. కొన్నేళ్ల క్రితం మెదడులో రక్తస్రావం జరగడం వల్ల మతి స్థిమితం కోల్పోయాడని అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. తాను ఈమెయిల్ పంపిన విషయం అసలు తమకు తెలియదని వారు చెప్పారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Pune Man Thought He Saw "Alien Object" Outside His Home, Writes To PM.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X