కంప్యూటర్ కోసం యాభైవేలు తీసుకురాలేదని భార్యను ఉరేసి చంపిన సాప్ట్‌వేర్ ఇంజనీర్

Posted By: Super

కంప్యూటర్ కోసం యాభైవేలు తీసుకురాలేదని భార్యను ఉరేసి చంపిన సాప్ట్‌వేర్ ఇంజనీర్

పూణె: ఐఎయస్ లా కాలేజి స్టూడెంట్ జయశ్రీ బాంబ్లే సోమవారం పూణెలోని కేసర్ వాడిలో ఉన్న వాళ్శ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకోవడం జరిగింది. ఈ కేసు నిమిత్తం భోసారి పోలీసులు జయశ్రీ భర్త అయినటువంటి సుశాంత్, బ్రదర్ ఇన్ లా సచిన్ ధార్వే, సిస్టర్ ఇన్ లా దీప్తి సచిన్ ధార్వేని అరెస్టు చేయడం జరిగింది. అస్సలు జయశ్రీ చనిపోవడానికి కారణం తన సాప్ట్‌వేర్ ఇంజనీర్ భర్త అయినటువంటి సుశాంత తన భార్యని లాప్ ట్యాప్ కోనుక్కోవడం కోసం తన పుట్టింటి నుండి రూ 50,000 తీసుకోని రమ్మని చాలా రోజులు నుండి వేధిస్తున్నాడంట. ఈ వేధింపులు తట్టుకోలేకనే జయశ్రీ ఫ్యాన్‌కి ఉరేసుకోని చనిపోయిందని పోలీసులు విచారణలో తేలింది.

పోస్ట్ మార్టం వివరాల ప్రకారం జయశ్రీ చనిపోయినటువంటి తీరు చూస్తుంటే ఇది హాత్యగా భావించారు. ఈ కేసు విషయమై పోలీసులు సుశాంత్ తల్లిదండ్రులుని కూడా అరెస్టు చేయడం జరిగింది. జయశ్రీని ఇంతలా వేధించడానికి కారణం వరకట్నమే ముఖ్యకారణమని ఆమె అన్నయ్య డాక్టర్ సంజయ్ సోనేకర్ వెల్లడించారు. ఇది ఖచ్చితంగా మర్డర్ నని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దానికి కారణం మా చెల్లి ఉరేసుకోని చనిపోయేటటువంటి పిరికిపంద కాదని అన్నారు. తను ఉరికి అంగీకరించికపోవడంతో తనని హింసించి మరీ ఉరి వేసినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది.

ఐతే జయశ్రీ తల్లిదండ్రులు మార్చి 23వ తారీఖునే సుశాంత్‌ని కలసి తన ల్యాప్ ట్యాప్ కోసం రూ 50,000 ఇవ్వడం జరిగిందన్నారు. ఇద్దరి కుటుంబాల మద్య ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని మార్చి 26వ తారీఖున కూర్చోని మాట్లాడుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంపై చర్చి జరుగుతున్న సమయంలో జయశ్రీని సుశాంత్ వాళ్శ చెల్లి తన తల్లిదండ్రుల ముందే గట్టిగా తోయడం జరిగింది. దాంతో ఏదో సర్ది చెప్పి తన కూతురుతో మాట్లాడి తల్లిదండ్రులు వెళ్శిపోయిన తర్వాత ఇలా తనని చంపేశారని జయశ్రీ తల్లి దండ్రులు వాపోయారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot