పార్ట్‌టైం జాబ్ పేరుతో మోసం.. రూ.3.07 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ పార్ట్‌టైం జాబ్ పేరుతో జరుగుతున్న మోసాలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. యువత ఎక్కువ సంఖ్యలో సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు. తాజాగా ఓ 25 సంవత్సరాల యువకుడు మోసపోయాడు. ఈ సెప్టెంబర్ నెలవరకు ఏకంగా రూ.3.07 లక్షల పోగొట్టుకున్నాడు.
మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఓ యువకుడు తన జాబ్ ప్రొఫైల్‌ను ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశాడు. కొందరు వ్యక్తులు మంచి పార్ట్ టైం జాబ్ చూపిస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారు. పూణేలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువకుడిని తొలుత గూగుల్ మ్యాప్ రివ్యూలు రాయాలని చెప్పారు. అనంతరం అతని నమ్మకాన్ని పొందేందుకు అతని బ్యాంకు ఖాతాలో కొంత నగదు జమచేశారు.

బాధితుడితో మరింత సన్నిహిత్యం పెంచుకున్న నేరగాళ్లు మరోక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో పనిచేయాలని కోరారు. అనంతరం ఆగస్టు 13, 14 మధ్య రూ. 3.07 లక్షలను బలవంతంగా బదిలీ చేయవలసి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం తాను చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వాలని నేరగాళ్లను బాధితుడు కోరాడు. అందుకు నేరగాళ్లు అంగీకరించలేదు. ఇంకా మరో రూ.50 వేలు చెల్లించాలని బాధితుడిని డిమాండ్ చేసినట్లు సమాచారం. అనంతరం నేరగాళ్లు.. బాధితుడితో సంబంధాలు తెంచుకున్నారు.
ప్రస్తుతం ఆన్‌లైన్ వేదికగా అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇదే అవకాశంగా భావించిన కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ఇటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినప్పుడు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకుండా భారీగా నగదు పోగొట్టుకొనే అవకాశం ఉంది.
ఇలాంటి నేరాలపై పోలీసులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇటువంటి ఘటనల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం సహా నేరగాళ్లకు శిక్షలు పడే విధంగా వ్యవహరిస్తున్నాయి. యువత సహా ఇతరులు ఎవరైతే ఆన్‌లైన్ లేదా పార్ట్‌టైం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది.
నేరగాళ్లకు చిక్కకుండా ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే అందుకు సంబంధించిన కొన్ని వ్యవస్థల ద్వారా ముందస్తు తనిఖీలు చేయించుకోవాలి. మీకు ఎటువంటి అనుమానం వచ్చినా.. వారితో ఎటువంటి సమాచారం పంచుకోకుండా ఉండాలి.
గతంలోనే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఉద్యోగాల పేరిట మోసాలు చాలా జరిగాయి. వారిపై పోలీసుల దర్యాప్తు కూడా వివిధ దశల్లో ఉంది. అందువల్ల అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఇటువంటి ప్రకటన పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ద్రువీకరణ లేకుండా నగదు సహా వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదు. ఇలాంటి ఘటనల పట్ల ముందుగానే అప్రమత్తంగా వ్యవహరించాలి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications