రైతు నడిపే యూట్యూబ్ ఛానల్‌కు 2.3 మిల్లియన్ సబ్‌స్క్రైబర్లు

By Gizbot Bureau
|

ఈ రోజుల్లో అత్యంత తక్కువ సమయంలో పాపులర్ కావాలనుకునే వారికి బెస్ట్ వే ఏదైనా ఉందంటే అది యూట్యూబ్ అనే చెప్పవచ్చు. ఇందులో చాలామంది తమ ప్రతిభను ప్రదర్శించి గొప్పవారు అయ్యారు. ఇందులో వీడియోలు అప్ లోడ్ చేసి తమ టాలెంట్ ని పరీక్షించుకునే వారు ఎందరో ఉన్నారు. యూట్యూబ్ అనేది చాలామంది డెవలప్ మెంట్కి ఓ ఫ్లాట్ ఫాం అని చెప్పవచ్చు. అయితే ఇందులో డబ్బులు కూడా సంపాదించుకునే మార్గం ఉంది. అయితే డబ్బులు కన్నా పేరు ఎక్కువగా సంపాదించుకునే వారు ఇందులో చాలామంది ఉన్నారు. వీరితో పాటు కొన్ని విషయాలను ప్రపంచానికి తెలిపే వారు ఉన్నారు. అలాంటి వారిలో పంజాబ్ కు చెందిన ఓ రైతు ఉన్నారు. ఈ రైతు కథ తెలిస్తే అందరూ చాలా ఆశ్చర్యపోతారు.

దర్శన్ సింగ్ 
 

దర్శన్ సింగ్ 

పంజాబ్ కు చెందిన దర్శన్ సింగ్ రైతులకు సంబంధించిన పలు విషయాలను తన ఛానల్ లో వివరిస్తుంటారు. రైతులకు తెలియని చాలా విషయాలను ఈయన ఛానల్ ద్వారాతెలుసుకోవచ్చు. వ్యవసాయం మీద ఎలా పనిచేయాలనే దానిపై వివిధ రకాల పద్దతులను వీడియో రూపంలో అందిస్తారు. దీని ద్వారా అతను ఆర్జిస్తున్న ఆదాయం నెలకు 4000 డాలర్ల వరకు ఉంది. ఇప్పుడు వ్యవసాయ కంపెనీలకు వీడియోలను తయారుచేస్తున్నారు. అతని ఛానల్ పేరు కూడా వ్యవసాయం పేరే ఉంటుంది. Farming Leader అనే పేరుతో ఛానల్ రన్ అవుతోంది.

2.3 మిల్లియన్ సబ్ స్క్రైబర్స్

2.3 మిల్లియన్ సబ్ స్క్రైబర్స్

ఇప్పుడు ఈ ఛానల్ కి 2.3 మిల్లియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇక మొత్తం వ్యూస్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. 170,599,145 వ్యూస్ ఈ ఛానల్స్ కి ఉన్నాయి. ఈ ఛానల్ లో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉంటాయి. మేకల పెంపకం, అలాగే వరి నాటుకు సంబంధించిన విషయాలు ఇంకా ఇతర వ్యవసాయపు పద్దతులు ప్రధానంగా ఉంటాయి. వీటితో పాటుగా వ్యవసాయానికి సంబంధించిన మిషన్లు, ట్రాక్టర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు రివ్యూలను అందిస్తూ ఉంటారు.

డైరీ ఫామ్ తో ప్రస్థానం

డైరీ ఫామ్ తో ప్రస్థానం

సింగ్ తొలిసారిగా 207లో డైరి ఫామ్ ని ప్రారంభించారు. అప్పటికే అతనికి వ్యవసాయం అంటే ఏంటో తెలియదు. ఇంటర్నెట్ ద్వారానే అన్నీ నేర్చుకున్నారు. తను నేర్చుకున్నది పదిమందికి ఉపయోగపడాలని చిన్న కెమెరా కొనుక్కుని ఛానల్ ద్వారా తన అనుభవాలను పంచుకున్నారు. అయితే తొలిసారిగా వీడియోలను షూట్ చూసింది మొబైల్ ద్వారానే.. ఇతను వీడియోలు చేయడం ప్రారంబించిన ఆరు నెలలకే మిల్లియన్ వ్యూస్ వచ్చాయి.

తర్వాత ప్రస్థానం
 

తర్వాత ప్రస్థానం

ఇక తన ఛానల్ ని మరింతగా విస్తరించేందుకు camera, mics, laptops ఇంకా ఇతర యాక్ససరీస్ ని కొనుగోలు చేసి యూట్యూబ్ ద్వారా రైతులకు తెలియని విషయాలను అందిస్తున్నారు. దీనికి ఆయనకు ఆదాయం కూడా లక్షల్లోనే ఉంది. ఇతని ఫ్యామిలీ అంతా వ్యవసాయానికి సంబంధించినదే అయినా ఇతను మాత్రం పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ చేశారు. డిగ్రీ తరువాత వ్యవసాయం వైపు తన కెరీర్ ను మల్చుకుని విజయం సాధించారు. ఇప్పుడు ఆర్గానిక్ ఫామ్ మీద తన దృష్టిని నిలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
This Punjab-based farmer helps over 2M YouTube subscribers with videos on better farming techniques

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X