Home
News

బ్యాటరీతో నడిచే స్కూటర్, కిలోమీటరు ఖర్చు 5 పైసలు మాత్రమే

Indian Institute of Technology Hyderabad విద్యార్థులు ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అత్యంత తక్కవ ధరతో పెట్రోలు సాయం లేకుండా కేవలం బ్యాటరీతో నడిచే వాహనాన్ని తయారుచేశారు. ఇండియా కండీషన్లకు అ

Indian Institute of Technology Hyderabad విద్యార్థులు ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అత్యంత తక్కవ ధరతో పెట్రోలు సాయం లేకుండా కేవలం బ్యాటరీతో నడిచే వాహనాన్ని తయారుచేశారు. ఇండియా కండీషన్లకు అనుగుణంగా వీటినే కమర్షియల్ గా వచ్చే నెలలో లాంచ్ చేయనున్నారు. లిధియం బ్యాటరీలతో నడిచే ఈ వాహనంకు ఎటువంటి పెట్రోలు కాని డీజెల్ కాని అవసరం లేదని కేవలం బ్యాటరీ ఛార్జ్ ద్వారా మాత్రమే ఇది రన్ అవుతుందని తెలిపారు.

బ్యాటరీతో నడిచే స్కూటర్, కిలోమీటరు ఖర్చు 5 పైసలు మాత్రమే

పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇవి మార్కెట్లోకి వస్తే మంచి అమ్మకాలను రాబట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టోరి పూర్తి వివరాల్లోకెళితే..

ప్యూర్ ఇవి సంస్థ సహకారంతో..

ప్యూర్ ఇవి సంస్థ సహకారంతో..

ఐఐటీ హైదరాబాద్ పరిశోధక విద్యార్థులు 2016లో అంకుర అనే స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. ఈ స్టార్టప్ ద్వారా ప్యూర్ ఇవి సంస్థ సహకారంతో తక్కువ ధరకే బ్యాటరీతో నడిచే వాహనాన్ని రూపొందించేలా కృషి చేశారు. వారి కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు వారి కళ్లెదురుగా కనిపిస్తోంది. వారు తయారు చేసిన వెహికల్ ద్వారా ఇప్పుడు ఎవరైనా సరే కేవలం ఐదు పైసలకే ఒక కిలో మీటరు ప్రయాణం చేయొచ్చు.

ఐదు పైసల్ చొప్పున 120 కిలో మీటర్ల ప్రయాణం

ఐదు పైసల్ చొప్పున 120 కిలో మీటర్ల ప్రయాణం

ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే చాలు కిలో మీట‌రుకు ఐదు పైసల్ చొప్పున 120 కిలో మీటర్ల ప్రయాణం చేయవచ్చు.తెలంగాణా రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న కంది మండల పరిధిలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ హైదరాబాద్ ఇందుకు వేదికగా నిలిచింది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు తమ మేథోశక్తితో తక్కువ ధరకే ఎక్కువ దూరం ప్రయాణించే సరికొత్త బ్యాటరీతో నడిచే ద్విచక్రవాహనాలను తయారు చేశారు. వీటి ధర కూడా తక్కువాగానే ఉంది.

రాబోయే నెల రోజుల వ్యవధిలో

రాబోయే నెల రోజుల వ్యవధిలో

తక్కువ ఖర్చుతో వాహనాదారులు ఎక్కువ దూరం ప్రయాణించాలనే ఆలోచనతో పుట్టిందే ఈ ప్యూర్ ఈవీ విద్యుత్ వాహనాలు అని విద్యార్థులు చెబుతున్నారు. రాబోయే నెల రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 18వేల పైగా వాహనాలను సిద్ధం చేయాలన్నదే తమ లక్ష్యమని అక్కడ పనిచేస్తున్న ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్ తెలిపారు. వీరికి మద్దతుగా ఐఐటీ ముంబాయికి చెందిన రోహిత్ సహకారంతో 2016లోనే ఈ సంస్థను విద్యార్థులు ప్రారంభించారు

రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు

రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు

దీని ద్వారా మన సమయం ఆదా అవ్వడమే కాకుండా మన ప్రయాణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇకపోతే ఈ వాహనం బరువు కూడా చాలా తక్కువ. కేవలం 45 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఎవరైనా ఈ వాహనాన్ని ఈజీగా నడిపించే వీలు కల్పించారు. వీటి ధర కూడా రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు మోడల్ ప్రకారం ధరలను నిర్ణయించడం జరిగిందని ఫ్రొపెసర్ నిశాంత్ చెప్పారు.

మొత్తం పదివేల వాహనాలను

మొత్తం పదివేల వాహనాలను

అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం పదివేల వాహనాలను మార్కెట్‌లో విక్రయించాలన్నదే తమ లక్ష్యమని నిశాంత్ చెప్పారు. మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి వాహనాల తయారీని ప్రతి యేటా పెంచడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు పర్యావరణ రక్షణను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో పొల్యూషన్ ఫ్రీ అయిన తమ వాహనాలను కొనుగోలు చేసి ప్రయాణించాలని తద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు నడుం బిగించాలని కోరారు.


ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.78 నుంచి రూ.80 వరకు ఉంది. డీజిల్ ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ద్విచక్రవాహనదారులు మొదలుకుని పెద్దపెద్ద కార్లలో తిరిగే వారికి పెట్రోల్, డీజిల్ చాలా ఖర్చుతో కూడకున్న వ్యవహారంలా మారింది. అది లేకుండా బండి ఇంచు కూడా ముందుకు కదిలే పరిస్థితి ఇప్పుడు కనపడటం లేదు. ఇప్పుడు ఈ బ్యాటరీతో కూడిన వాహనాలు రావడంద్వారా దీనికి చెక్ పెట్టవచ్చు. త్వరలో ఈ బ్యాటరీతోనే 4 చక్రాల వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

 

పూర్తిగా చార్జింగ్ అవడానికి..

పూర్తిగా చార్జింగ్ అవడానికి..

లిథియం బ్యాటరీతో తయారు చేసిన ఈ వాహనాలను ఒకసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. పూర్తిగా చార్జింగ్ అవడానికి కూడా చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. కేవలం నాలుగు గంటల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
pure ev launches long range high performance electric two wheelers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X