సాప్ట్‌వేర్ ఇంజనీర్ జీవితాన్ని నాశనం చేసిన హిజ్రాలు

Posted By: Super

సాప్ట్‌వేర్ ఇంజనీర్ జీవితాన్ని నాశనం చేసిన హిజ్రాలు

విజయవాడ/ఏలూరు: యంగ్ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ని రన్నింగ్‌లో ఉన్న రైలు నుండి తోసేసి అతని ఆశల్ని అడియాసలు చేసారు హిజ్రాలు. సాధారణంగా రైళ్శలలో హిజ్రాలు డబ్బుల కోసం ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంటారు. ఐతే ఇక్కడ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ని ఇబ్బంది పెట్టడమే కాకుండా అతని దగ్గరున్నటువంటి డబ్బులను బలవంతంగా లాక్కొని ఏకంగా రైలు బోగి నుండి క్రిందకు తోసివేసిన విషాద సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.

ఈ ప్రమాదంలో ఏలూరులో మిడిల్ క్లాస్ కుటుంబానికి సంబంధించిన 22సంవత్సరాల వయసు కలిగిన నిమ్మల రంజిత్ కుమార్ బలయ్యాడు. ఇక వివరాలలోకి వెళితే మే 9వ తారీఖున విజయవాడ నుండి ఏలూరు వెళ్శడం కోసం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కినటువంటి రంజిత్ కుమార్ దగ్గరకు వచ్చినటువంటి హిజ్రాలకు తన వద్ద ఉన్నటుంటి కాయిన్స్‌ని ఇచ్చినప్పటికీ అవి సరిపోలేదంటూ ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. దాంతో రంజిత్ ఎక్కువ డబ్బు ఇవ్వలేనని అనడంతో అతని జేబులో ఉన్నటువంటి రూ900లను తీసుకోని తన వద్దనుండి వెళ్శిపోతుండగా వారిని వెంబడించినందుకుగాను రంజిత్‌‌ను రైలు బోగి నుండి తోసివేయడం జరిగిందని అన్నాడు. ఈ ప్రమాదంలో రంజిత్ తన కుడి కాలు, కుడి చేయికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ప్రస్తుతం రంజిత్ విజయవాడలోని ఆర్దోపెడిక్ హాస్పిటల్‌‌లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. రంజిత్ వాళ్శ నాన్నాగారు ఇచ్చినటువంటి కంప్లైంట్‌ని బట్టి రైల్వే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషాద సంఘటన జరిగి చాలా రోజులు అయినప్పటికీ సోమవారం వెలుగులోకి వచ్చింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot