బ్లాక్‌బెర్రీ మొబైల్‌లో 'పివిఆర్' సినిమాలు

Posted By: Staff

బ్లాక్‌బెర్రీ మొబైల్‌లో 'పివిఆర్' సినిమాలు

 

ఇండియాలో వినోద ఆధారిత కంపెనీగా వ్యవహారిస్తున్న పివిఆర్ సంస్ద ప్రత్యేకించి బ్లాక్‌బెర్రీ యూజర్స్ కోసం పివిఆర్ మొబైల్ అప్లికేషన్‌ని విడుదల చేసింది. దీంతో పివిఆర్ అభిమానులు షో టైమ్స్‌ని ఈజీగా వారియొక్క మొబైల్ ఫోన్స్ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న పివిఆర్ ధియేటర్లలలో ఉన్న అన్ని సినిమాలకు ఇది వర్తిస్తుందని పివిఆర్ ప్రతినిధి వెల్లడించారు.

బ్లాక్‌బెర్రీ డివైజ్ ద్వారా వినియోగదారులు సినిమా ట్రైలర్స్, టిక్కెట్స్ బుక్ చేసుకోవడంతో పాటు సినిమాలకు సంబంధించిన సమాచారం అంతా తెలుసుకోవచ్చు. సినిమా సంగ్రహంతో పాటు... హై క్వాలిటీ వీడియో ట్రైలర్స్, సినిమా పోస్టర్స్‌ని వీక్షించవచ్చు. ఇంకోక విశేషం ఏమింటటే ఈ అప్లికేషన్ ద్వారా టిక్కెట్స్‌ని బుక్ చేసుకున్న యూజర్స్ వారికి కావాల్సిన సీట్లను చూసి మరీ ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చెల్లింపులు చెల్లించవచ్చు. వీటితో పాటు రాబోయే కాలంలో పివిఆర్ థియేటర్లలలో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot