ఇండియా లో అన్నింటికీ UPI నే ...! మూడు నెలల్లో UPI ద్వారా ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే ...!

By Maheswara
|

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) నేతృత్వంలోని వివిధ చెల్లింపుల మోడ్‌ల ద్వారా భారతదేశం మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి కాలం లో) రూ. 10.25 ట్రిలియన్ల విలువైన మరియు సంఖ్య మొత్తంలో 9.36 బిలియన్ల లావాదేవీలను రికార్డు చేసింది. సోమవారం వెలువడిన ఒక కొత్త నివేదిక ఈ వివరాలను తెలియచేసింది. ఈ పేమెంట్ చెల్లింపుల పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన వరల్డ్‌లైన్ రిపోర్ట్ ప్రకారం, ఈ మొత్తం సంఖ్య 64 శాతం మరియు విలువ పరంగా 50 శాతం మార్కెట్ వాటాతో వినియోగదారుల మధ్య UPI P2M (వ్యక్తి నుండి వ్యాపారి) లావాదేవీలుగా అత్యంత ప్రాధాన్య చెల్లింపులుగా నివేదిక చెప్తోంది.

 

UPI ద్వారా

2022 మొదటి త్రైమాసికం లో, UPI ద్వారా 14.55 బిలియన్లకు పైగా లావాదేవీలను మరియు విలువ పరంగా రూ. 26.19 ట్రిలియన్ల విలువను సాధించింది. Q1 2021తో పోలిస్తే ఈ వాల్యూమ్‌లో 99 శాతం పెరుగుదల మరియు విలువలో 90 శాతానికి పైగా పెరుగుదల గత సంవత్సరం నుండి దాని లావాదేవీల పరిమాణం మరియు విలువ దాదాపు రెండింతలు పెరిగింది. మొదటి త్రైమాసికం నాటికి, వాల్యూమ్ పరంగా టాప్ UPI యాప్‌లు PhonePe, Google Pay, Paytm పేమెంట్స్ బ్యాంక్ యాప్, Amazon Pay, Axis banks యాప్ అయితే టాప్ PSP UPI ప్లేయర్‌లు YES బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్ మరియు Paytm పేమెంట్స్ బ్యాంక్ వాటి ద్వారా ఈ లావాదేవీలు రికార్డు అయినట్టు తెలుస్తోంది.

టాప్ UPI యాప్‌లు

టాప్ UPI యాప్‌లు

టాప్ UPI యాప్‌లు అయిన, Phone Pe, Google Pay మరియు Paytm మార్చి 2022 నాటికి UPI లావాదేవీల పరిమాణంలో 94.8 శాతం మరియు UPI లావాదేవీల విలువలో 93 శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. UPI P2P (పీర్-టు-పీర్) లావాదేవీలకు సగటున పరిమాణం (ATS) రూ. 2,455 మరియు P2M లావాదేవీలకు (మార్చి నాటికి) రూ. 860.గా ఉంది.

మొత్తం లావాదేవీలలో
 

మొత్తం లావాదేవీలలో

ఈ మొత్తం లావాదేవీలలో క్రెడిట్ కార్డ్‌లు 7 శాతం వాటాను కలిగి ఉన్నాయి, అయితే విలువలో 26 శాతం గా ఉన్నాయి. ఎక్కువ మొత్తం కలిగిన లావాదేవీల కోసం కస్టమర్‌లు ఇప్పటికీ తమ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడానికి ఇష్టపడతారని సూచిస్తుంది. డెబిట్ కార్డ్‌లు 10 శాతం లావాదేవీలను కలిగి ఉన్నాయి, అయితే విలువలో 18 శాతం మాత్రమే ఉన్నాయి. UPI పెరుగుదల కారణంగా డెబిట్ కార్డుల వాడకం మునుపటి సంవత్సరాల కంటే తగ్గిపోయింది.

POS టెర్మినల్స్

POS టెర్మినల్స్

మార్చి నాటికి, బ్యాంకుల ద్వారా అమలు చేయబడిన మొత్తం POS టెర్మినల్స్ సంఖ్య 6.07 మిలియన్లకు పైగా 6.07 మిలియన్ల కంటే ఎక్కువ POS టెర్మినల్స్ Q1 2022లో అమలులోకి  తీసుకురాబడ్డాయి. POS విస్తరణ Q1 2022లో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 28 శాతం వృద్ధిని సాధించింది.

క్యూఆర్‌ కోడ్

క్యూఆర్‌ కోడ్

మార్చి నాటికి, భారత్ క్యూఆర్‌ కోడ్ ల మొత్తం సంఖ్య 4.97 మిలియన్లుకు చేరింది. మార్చి 2021తో పోల్చితే 39 శాతం పెరిగి UPI క్యూఆర్‌లు 172.73 మిలియన్లుగా ఉన్నాయి. మార్చి 2021తో పోలిస్తే 87 శాతం వృద్ధిని నమోదు చేసింది. జనవరి నాటికి, భారతదేశంలో దాదాపు 658 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు మరియు 1.2 బిలియన్ల మొబైల్ చందాదారులు ఉన్నారు. Q1 2022లో, వినియోగదారులు 15.6 బిలియన్ల మొబైల్ ఆధారిత చెల్లింపులు చేశారు, అయితే నెట్ బ్యాంకింగ్/ఇంటర్నెట్ బ్రౌజర్ ఆధారిత లావాదేవీలు 1 బిలియన్ కంటే ఎక్కువగా ఉన్నాయని నివేదిక చూపింది.

భద్రత చిట్కాలు పాటించండి.

భద్రత చిట్కాలు పాటించండి.

అవసరం కొద్దీ అధిక మొత్తం లో UPI లావాదేవీలు చేస్తూనే ఉంటాము.ఇలా Digital Payments చేస్తున్నప్పుడు మీ ఖాతా యొక్క భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని మసలుకోవాలి.ఈ చిట్కాలు పాటించండి.
** పేమెంట్స్ యాప్ ఫోన్ కాల్ ద్వారా KYC ని ధృవీకరించదు. కావున మీకు ఇటువంటి ఫోన్ కాల్స్ / SMS లు వస్తే కనుక అవి మిమ్మల్ని మోసం చేయాలని వచ్చినవి అని గ్రహించండి.
** మీ యొక్క ఫోన్ లో SMS లేదా ఇమెయిల్ ద్వారా పంపిన ఎటువంటి లింక్‌ మీద క్లిక్ చేయవద్దు.
** 'కస్టమర్ సర్వీస్' ఎగ్జిక్యూటివ్ సలహా మేరకు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎటువంటి యాప్ ను ఇన్‌స్టాల్ చేయకూడదు.
** ఫోన్ కాల్ ఆధారంగా ఎప్పుడు రూ.1 లావాదేవీని కూడా చేయకూడదు.
** KYCని పొందడానికి SMS లో ఇచ్చిన నంబర్‌కు ఎటువంటి పరిస్థితులలోను కాల్ చేయకూడదు.
** మీ యొక్క బ్యాంకుకు సంబందించిన ఎటువంటి ఆర్థిక వివరాలను ఫోన్‌లలో స్టోర్ చేసుకోకపోవడం చాలా మంచిది.
** మీ ఏటీఎం కార్డు పిన్‌ను ఎలా రహస్యంగా మెయింటైన్ చేస్తారో యూపీఐ పిన్‌ కూడా అలాగే సీక్రెట్‌గా ఉంచాలి. అంతేకాదు మీ UPI అకౌంట్ ఉన్న యాప్‌లో తప్ప మరొక యాప్‌లో మీ UPI పిన్‌ను ఎంటర్ చేయకపోవడం చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం మీరు డబ్బులు పంపడానికి మరియు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి మాత్రమే UPI పిన్ ను ఉపయోగించవలసి ఉంటుంది.
** మీరు డబ్బులు స్వీకరించేందుకు UPI పిన్ అవసరం ఉండదు. ఎవరైనా మీకు డబ్బులు పంపుతున్నామని మీ యాప్‌లో వెంటనే UPI పిన్ ఎంటర్ చేయండి అని అడిగితే అస్సలు ఎంటర్ చేయకండి. అటువంటి ఫోన్ కాల్ లేదా SMS ను పూర్తిగా మరచిపోవడం చాలా మంచిది.

Best Mobiles in India

English summary
Q1 2022 UPI Transactions; 9.36 Billion UPI Transactions Worth Rs 10.25 Trillion Happened In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X