Home
News

ఇక ఫీచర్ ఫోన్లలోనూ 4G VoLTE, క్వాల్కమ్ కొత్త ప్రాసెసర్ విడుదలైంది

150Mbps డౌన్‌లోడ్ స్పీడ్, 50Mbps అప్‌లోడ్ స్పీడ్

By Sivanjaneyulu Bommu

ప్రముఖ మొబైల్ చిప్‌సెట్‌ల తయారీ కంపెనీ క్వాల్కమ్ సరికొత్త చిప్‌సెట్‌ను విడుదల చేసింది. ప్రత్యేకించి ఫీచర్ ఫోన్‌ల కోసం Qualcomm 205 SoC పేరుతో రూపొందించబడిన ఈ కొత్త చిప్ LTE ఇంకా 4G VoLTE కనెక్టువిటీలను సపోర్ట్ చేస్తుంది.

Read More : ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్, ఆఫర్లు ఇవే..

 LTE Cat. 4 మోడె

LTE Cat. 4 మోడె

రూ.3,500లోపు లభ్యమయ్యే అన్ని ఫీచర్ ఫోన్‌లకు 4జీ సౌకర్యాన్ని కల్పించే విధంగా ఈ క్వాల్కమ్ సాక్‌ను తయారు చేసారట. ఈ చిప్‌లో ఏర్పాటు చేసిన LTE Cat. 4 మోడెమ్, 150Mbps వరకు డౌన్‌లోడ్ వేగంతో పాటు 50Mbps వరుక అప్‌లోడ్ వేగాన్ని ఆఫర్ చేయగలదని క్వాల్కమ్ చెబుతోంది.

4జీ, 3జీ, 2జీ

4జీ, 3జీ, 2జీ

4G VoLTE కనెక్టువిటీతో పాటు 3జీ, 2జీ నెట్‌వర్క్‌లను కూడా ఈ చిప్‌సెట్ సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ సిమ్, ANT+, ఎఫ్ఎమ్ రేడియో, బ్లుటూత్, వై-ఫై వంటి కనెక్టువిటీ ఫీచర్లను క్వాల్కమ్ 205 సాక్ ఆఫర్ చేయగలదు.

హైడెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్‌

హైడెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్‌

ఈ చిప్‌సెట్‌లో పొందుపరిచిన డ్యుయల్ కోర్ (క్లాక్ స్పీడ్ 1.1GHz) ప్రాసెసర్ 3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ ఫేసింగ్ కెమెరాలను సపోర్ట్ చేయగలదు. లైనక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంతో పాటు హైడెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్‌ను కూడా ఈ చిప్ సపోర్ట్ చేస్తుంది.

త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి..

త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి..

క్వాల్కమ్ కొత్త చిప్‌తో కూడిన ఫీచర్ ఫోన్‌లు త్వరలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. జియో ఆఫర్ చేయబోతున్న 4G VoLTE ఫీచర్ ఫోన్లలో కూడా వీటినే ఉపయోగించే అవకాశముంది.

Best Mobiles in India

English summary
Qualcomm 205 SoC launched for 4G VoLTE feature phones. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X