Home
News

క్వాల్‌కామ్ వర్సెస్ మీడియాటెక్.. 6G రేసులో దిగ్గజ కంపెనీలు బిగ్ ఫైట్.. గెలిచేది ఎవరు?

6G Race: 5G టెక్నాలజీ ఆల్రెడీ లాంచ్ అయ్యి వేగవంతమైన డేటా స్పీడ్స్‌తో ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరింత ఆశ్చర్యపరచడానికి 6G టెక్నాలజీ సిద్ధమవుతోంది. మొబైల్ రంగంలో పెద్ద కంపెనీలు దీని కోసం వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే శామ్‌సంగ్, ఆర్మ్ సంస్థలు డేటా వేగం, సామర్థ్యం పెంచడంపై పనిచేస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్లలో టాప్ కంపెనీలైన క్వాల్‌కామ్, మీడియాటెక్ కూడా ఈ రేసులో దూకాయి.

6Gని ప్రపంచ ప్రమాణంగా మార్చేందుకు ఈ రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి. క్వాల్‌కామ్ అయితే 2025 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో (MWC) పెద్ద ప్రకటన చేసింది. నోకియా బెల్ ల్యాబ్స్, రోడ్ అండ్ స్క్వార్జ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. అటు మీడియాటెక్ కూడా వేరే సంస్థలతో కలిసి 6G సొల్యూషన్స్‌ను రెడీ చేస్తోంది.

Qualcomm and MediaTek Enter the 6G Race

* క్వాల్‌కామ్ 6G విజన్

క్వాల్‌కామ్ మాత్రం 6G కోసం చాలా రకాలుగా ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ నెట్‌వర్క్‌లను మరింత స్మార్ట్‌గా, సమర్థవంతంగా మారుస్తుందని నమ్ముతోంది. AIతో నడిచే టెక్నాలజీతో, నెట్‌వర్క్‌లు ఎప్పటికప్పుడు మారుతూ వేగం, కనెక్టివిటీని పెంచుతాయి. అంతేకాదు, క్వాల్‌కామ్ FR3 బ్యాండ్‌పై కూడా పనిచేస్తోంది. ఇది 6Gలో చాలా కీలకం కానుంది.

ఈ బ్యాండ్ వల్ల డేటా వేగం బాగా పెరుగుతుంది, నెట్‌వర్క్ లేటెన్సీ (సమాచారం చేరడంలో ఆలస్యం) తగ్గుతుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) డివైజ్‌లకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా డేటా ట్రాన్స్‌మిషన్ సామర్థ్యం పెంచడానికి MIMO (మల్టిపుల్ ఇన్‌పుట్ మల్టిపుల్ ఔట్‌పుట్) సిస్టమ్స్‌ను కూడా క్వాల్‌కామ్ అభివృద్ధి చేస్తోంది.

* ప్రమాణాల కోసం మీడియాటెక్ కూడా జత కలిసింది..

క్వాల్‌కామ్ AI టెక్నాలజీతో నెట్‌వర్క్‌లను మెరుగుపరిచే పనిలో ఉంది. కానీ మీడియాటెక్ కూడా 6G ప్రమాణాలను సెట్ చేసే పనిలో ఉంది. రెండు కంపెనీలు పోటీదారులే అయినా, 6G ఎలా పనిచేయాలి అనే విషయంలో ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలతో కలిసి, ప్రపంచమంతా 6Gని సులువుగా వాడేలా టెక్నికల్ స్టాండర్డ్స్‌ను సెట్ చేయాలని చూస్తున్నాయి.

* 6Gలో శామ్‌సంగ్, ఆర్మ్ పాత్ర

ఇదివరకే శామ్‌సంగ్, ఆర్మ్ సంస్థలు 6G కోసం పనిచేస్తున్నాయి. వీళ్లు ప్యారలల్ ప్యాకెట్ ప్రాసెసింగ్ (PPP) టెక్నాలజీపై ఫోకస్ పెట్టారు. ఇది డేటా అనేది నెట్‌వర్క్‌లలో వేగంగా, సమర్థవంతంగా కదిలేలా చేస్తుంది. శామ్‌సంగ్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU)తో కలిసి గ్లోబల్ 6G ప్రమాణాలను సెట్ చేస్తోంది.

వీళ్ల పరిశోధనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సింగ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ పద్ధతులను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాయి. ఇవన్నీ భవిష్యత్ నెట్‌వర్క్‌లకు చాలా ముఖ్యం. క్వాల్‌కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ స్మీ చెప్పిన ప్రకారం, 2025 సంవత్సరం 6G ప్రమాణాల కోసం చాలా కీలకం కానుంది.

6G నెట్‌వర్క్‌లు ఎలా పనిచేయాలి, ఎలా అభివృద్ధి చెందాలి అనేది ఈ ప్రక్రియలో నిర్ణయిస్తారు. క్వాల్‌కామ్, మీడియాటెక్, శామ్‌సంగ్, ఆర్మ్ మధ్య పోటీ 6G అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది. 6G స్పీడ్స్ 1TB/s వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇది మొబైల్ కనెక్టివిటీ, AI టెక్నాలజీ, స్మార్ట్ డివైజ్‌లలో ఊహించని మార్పులు తీసుకురావచ్చు.

6G పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా టైమ్ పట్టొచ్చు, కానీ దీనికి పునాది మాత్రం ఇప్పుడే పడుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Qualcomm, MediaTek, Samsung, and Arm are racing to develop 6G. Focusing on standardization and faster networks, Qualcomm emphasizes AI and FR3 band. 6G promises unprecedented speeds and advancements, with standardization starting in 2025.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X