Home
News

5G మద్దతుతో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్ చిప్‌సెట్‌లు

ప్రపంచం మొత్తం ప్రస్తుతం మొబైల్ టెలికమ్యూనికేషన్ విభాగంలో 5G నెట్‌వర్క్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. 5G నెట్‌వర్క్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G కంటే వేగంగా ఉంటుంది. 5G మొదట ప్రవేశపెట్టినప్పటి నుండి అధిక-ధర గల డివైస్ లలో మాత్రమే అందుబాటులో ఉండటానికి పరిమితం చేయబడింది. కానీ ఇప్పుడు క్వాల్కమ్ యొక్క చిప్‌సెట్‌లు 5G సపోర్ట్ తో ప్రీమియం మరియు మిడ్-రేంజ్ డివైస్లలో కూడా విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించింది.

5G మద్దతు చిప్‌సెట్‌లు

5G మద్దతు చిప్‌సెట్‌లు

5G మద్దతుతో కూడిన మిడ్-రేంజ్  చిప్‌సెట్లను మీడియాటెక్ సంస్థ దాని ఉత్పత్తి శ్రేణిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ కంపెనీ వివిధ రకాల ధరల విభాగాలలో వాటి డైమెన్సిటీ సిరీస్ చిప్‌సెట్లను తయారుచేస్తున్నది. క్వాల్కమ్ సంస్థ కూడా ఇటీవల స్నాప్‌డ్రాగన్ 690 అనే 5G చిప్‌సెట్‌ను విడుదల చేశారు. కాకపోతే ఇది హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లకు 5G అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. ఇది ఇప్పటికీ చాలా ఖరీదైనది. క్వాల్కమ్ సంస్థ ఇప్పుడు అందుబాటు ధరలో తమ కొత్త స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్ చిప్‌లకు 5G మద్దతుతో తీసుకురావాలని యోచిస్తున్నారు.

IFA 2020 లో క్వాల్కమ్ 5G ప్రకటన

IFA 2020 లో క్వాల్కమ్ 5G ప్రకటన

క్వాల్‌కామ్ సంస్థ మొదటిసారిగా IFA 2020 ఈవెంట్ లో 5G చిప్ లను ప్రకటించింది. 2021 మొదటి త్రైమాసికంలో స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్ చిప్‌సెట్‌లను 5G కనెక్టివిటీ సపోర్ట్‌తో తీసుకువస్తున్నట్లు యుఎస్ చిప్‌మేకర్ తన ప్రకటనలో వెల్లడించింది.

క్వాల్కమ్ 5G చిప్‌సెట్ వివరాలు

క్వాల్కమ్ 5G చిప్‌సెట్ వివరాలు

5G కనెక్టివిటీని విస్తృతంగా అందించడమే లక్ష్యంగా స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్‌ చిప్‌సెట్‌లను తీసుకువస్తున్నట్లు క్వాల్కమ్ తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్‌తో కనీసం 3.5 బిలియన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5G స్పీడ్ మద్దతుతో డేటాను ఆస్వాదించగలుగుతారు. అంతేకాక ఇది తరువాతి తరం కనెక్టివిటీని చాలా త్వరగా స్వీకరించడాన్ని వేగవంతం చేస్తుంది.

క్వాల్కమ్ చిప్‌సెట్‌ల మార్కెట్

క్వాల్కమ్ చిప్‌సెట్‌ల మార్కెట్

4G కనెక్టివిటీని ప్రవేశపెట్టినప్పుడు మొదట 1 బిలియన్ వినియోగదారులను చేరుకోవడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. 2022 నాటికి 5G స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 750 మిలియన్లకు పెరుగవచ్చు అని క్వాల్కమ్ అంచనా వేసింది. ఈ సంఖ్య 2023 నాటికి 1 బిలియన్లకు అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్ అనేది క్వాల్కమ్ యొక్క సరసమైన చిప్‌సెట్ అంటే 5G కనెక్టివిటీ కలిగిన తక్కువ ధర ట్యాగ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లను త్వరలోనే చూస్తాము. మోటరోలా, ఒప్పో మరియు షియోమి వంటి అనేక కంపెనీలు దీనిని ఉపయోగించడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.

స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్ చిప్‌సెట్ ఫీచర్స్

స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్ చిప్‌సెట్ ఫీచర్స్

క్వాల్కమ్ యొక్క కొత్త స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్ చిప్‌సెట్ల యొక్క ప్రత్యేకతల గురించి ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు తెలియలేదు. కాకపోతే ఇవి హై-స్పీడ్ సబ్- 6GHz 5G మరియు mmWave నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుందా లేదా అనేది కూడా అస్పష్టంగా ఉంది. రాబోయే లీక్‌లలో వీటి యొక్క వివరాలను తెల్సుకోవచ్చు అని ఆశిద్దాము.

Best Mobiles in India

English summary
Qualcomm Brings Snapdragon 4 Series with 5G Support
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X