Home
News

స్నాప్‌డ్రాగన్‌ ఫర్‌ ఇండియా.. రూ.8 వేల నుంచే 5G స్మార్ట్‌ఫోన్‌లు.. ఈ చిప్‌సెట్ ప్రత్యేకతలేంటి?

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు గణనీయంగా ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన 5G నెట్‌వర్క్‌ కారణంగా 5G స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఆశించిన మేర ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రాలేదు. భారత్‌లో తక్కువ ధరకే 5G స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ చిప్‌సెట్‌ల తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ (Qualcomm Snapdragon 4s Gen 2 Chipset) కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా మంగళవారం స్నాప్‌డ్రాగన్‌ ఫర్‌ ఇండియా పేరుతో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంట్రీ లెవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్నాప్‌డ్రాగన్‌ 4S జెన్‌ 2 చిప్‌సెట్‌ ను విడుదల చేసింది. ఈ చిప్‌సెట్‌తో తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకురావచ్చని భావిస్తోంది. కేవలం రూ.8 వేలకే 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చని భావిస్తోంది.

Qualcomm launched Snapdragon 4s gen 2 chipset in india

సంవత్సరం చివరి నాటికి తొలి స్మార్ట్‌ఫోన్‌ :
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ షియోమీ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ చిప్‌సెట్‌తో తొలి స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌ ద్వారా గిగాబిట్‌ 5Gని మోడెమ్‌ RF సపోర్టుతో మరింత తక్కువ ధరకే అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

భారత్‌లో కేవలం జియో మాత్రమే ఈ తరహా నెట్‌వర్క్‌ కలిగి ఉంది :
ఈ చిప్‌సెట్‌ డ్యూయల్‌ 5G కనెక్షన్‌ సపోర్టు చేస్తుంది. 4G నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసే SA 5G నెట్‌వర్క్‌ను కూడా సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌లో కేవలం జియో మాత్రమే SA (Standalone) 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని అందిస్తోంది.

ఈ చిప్‌సెట్‌ ఏమేం సపోర్టు చేస్తుంది :
ఈ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4S జెన్ 2 చిప్‌సెట్‌ 8 కోర్‌ క్వాల్‌కామ్‌ kyro CPUతో 64 బిట్‌ ఆర్కిటెక్చర్‌పై అభివృద్ధి చేశారు. Adreno GPU ఆన్‌బోర్డ్‌ OpenGL ES 3.2 Vulkan 1.1 మరియు OpenCL 2.0 API లను సపోర్టు చేస్తుంది. ఈ చిప్‌సెట్‌ LPDDR4x మరియు UFS 3.1 వరకు సపోర్టు చేస్తుందని తెలిపింది.

దీంతోపాటు ఈ చిప్‌సెట్ 12 బిట్‌ ఇమేజ్‌ సిగ్నల్‌ ప్రాసెసర్‌.. ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (EIS), మల్టీ ఫ్రేమ్‌ నాయిస్‌ రిడక్షన్‌ ఫీచర్‌లతో గరిష్ఠంగా 84MP సింగిల్ కెమెరా సెన్సార్‌లను సపోర్టు చేస్తుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో పుల్‌ HD+ డిస్‌ప్లేను సపోర్టు చేస్తుంది. 60fps తో కూడిన 1080p రిజల్యూషన్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌ క్విక్‌ ఛార్జ్‌ 4+ టెక్నాలజీ సహా USB-C 3.2 జెన్ 1 ఇంటర్‌ఫేస్‌ వరకు సపోర్టు చేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Qzss, Galileo, Beidou, Glonass, Navlc వంటి నావిగేషన్‌ వ్యవస్థలను సపోర్టు చేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 5.1 మరియు వైఫై 5 సపోర్టు చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Qualcomm launched Snapdragon 4s gen 2 chipset in india for low cost 5G smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X