లెనోవో నుంచి ఫస్ట్ 5జీ ల్యాప్‌టాప్, డౌన్‌లోడ్ స్పీడ్ తెలిస్తే షాకే

ఇప్పటిదాకా 4జీ అంటే అపరిమితమైన వేగంతో వస్తుందని సంబరపడ్డాం. అయితే ఇప్పుడు 4జీ కన్నా పదిరెట్లు వేగంతో 5జీ రాబోతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే దీని మీద ప్రయోగాత్మక పరిశోధనలు సాగుతున్నాయి. మొబైల్ హ్యాండ్

|

ఇప్పటిదాకా 4జీ అంటే అపరిమితమైన వేగంతో వస్తుందని సంబరపడ్డాం. అయితే ఇప్పుడు 4జీ కన్నా పదిరెట్లు వేగంతో 5జీ రాబోతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే దీని మీద ప్రయోగాత్మక పరిశోధనలు సాగుతున్నాయి. మొబైల్ హ్యాండ్‌‌సెట్స్ తయారీ కంపెనీలు 5జీ స్మార్ట్‌ఫోన్స్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. అలాగే ఇవి 5జీ స్మార్ట్‌టీవీలపై కూడా పనిచేస్తున్నాయి.

 
లెనోవో నుంచి ఫస్ట్ 5జీ  ల్యాప్‌టాప్, డౌన్‌లోడ్ స్పీడ్ తెలిస్తే షాకే

ఇప్పుడు తాజాగా టెక్ కంపెనీలు 5జీ ల్యాప్‌టాప్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. ఇందులో పలు రకాల కంపెనీలు పోటీపడుతున్నాయి. అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ క్వాల్‌కామ్, చైనాకు చెందిన కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో సంస్థలు 5జీ ల్యాప్‌టాప్స్ కోసం చేతులు కలిపాయి. ప్రాజెక్ట్ లిమిట్‌లెస్ కోడ్ నేమ్‌తో ఈ 5జీ ల్యాప్‌టాప్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ప్రపంచంలోనే తొలిసారిగా 7ఎన్ఎం ప్రాసెసర్ ఉండబోతోంది.

స్నాప్‌డ్రాగన్ 8సీఎక్స్ కంప్యూటర్ ప్లాట్‌ఫామ్‌

స్నాప్‌డ్రాగన్ 8సీఎక్స్ కంప్యూటర్ ప్లాట్‌ఫామ్‌

లెనొవొ, క్వాల్‌కామ్ కంపెనీలు రూపొందిస్తున్న ల్యాప్‌టాప్స్ స్నాప్‌డ్రాగన్ 8సీఎక్స్ కంప్యూటర్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయి. అంటే ఇవి 5జీతోపాటు 4జీని కూడా సపోర్ట్ చేస్తాయి. అలాగే వీటిల్లో బ్యాటరీ చార్జింగ్ కూడా కొన్ని రోజులపాటు రానుంది. ఈ విషయాన్ని టెక్ క్రంచ్ కోట్ తొలిసారిగా కోట్ చేసింది.

2.5 జీబీపీఎస్ స్పీడ్‌

2.5 జీబీపీఎస్ స్పీడ్‌

5జీ ల్యాప్‌టాప్స్‌లో స్నాప్‌డ్రాగన్ ఎక్స్55 5జీ మోడెం‌ను అమర్చనున్నారు. దీంతో 2.5 జీబీపీఎస్ స్పీడ్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఎప్పుడు మార్కెట్‌లోకి వచ్చేది తెలియదు. Project Limitlessకు సంబంధించి లాంచింగ్ తేదీ కాని అలాగే ధరను కాని అధికారికంగా బహిర్గతం చేయలేదు. క్వాల్‌కామ్, లెనొవొ సంస్థలు 5జీ ల్యాప్‌టాప్ గురించి కంప్యూటెక్స్ సదస్సులో ప్రకటన చేశాయి. ఈ కాన్ఫరెన్స్ తైవాన్‌లో జరుగుతోంది

డొనాల్డ్ ట్రంప్ దెబ్బ
 

డొనాల్డ్ ట్రంప్ దెబ్బ

కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య చైనా కంపెనీలపై బ్యాన్ విధించడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ప్రభావం కూడా ఈ కంపెనీలపై పడుతుండటంతో అధికారికంగా బహిర్గతం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మే 15న చైనా మేజర్ మొబైల్ మేకర్ హువాయి కంపెనీని బ్యాన్ చేయమని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. Google, Microsoft, Intel and ARM వంటి కంపెనీలు కూడా హువాయి కంపెనీతో ఎటువంటి లావాదేవీలు నడపరాదని నిర్ణయించాయి.

యుఎస్ చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో

యుఎస్ చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో

ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన క్వాల్‌కామ్ కూడా యుఎస్ చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో హువాయి కంపెనీతో తన బంధాన్ని విరమించుకుంది. దీంతో చైనా కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 5జీపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న చైనా క్వాల్ కామ్ సపోర్టును విత్ డ్రా చేసుకోవడంతో చైనా ఆశల మీద చల్లినట్లు అయింది. South Korea, China, Japan, Australia and the US వంటి దేశాలు 5జీ మీద ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి.

 2025 నాటికి

2025 నాటికి

ఇదిలా ఉంటే చైనా 5జీలో దూసుకుపోతోంది. 2025 నాటికి చైనా 40 శాతం కనెక్షన్లు ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇండియా ఇప్పటికే 5జీ మీద కసరత్తులు చేస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఇండయాకి 5జీ పరిచయం అయ్యే అవకాశం ఉంది . యూకేకు చెందిన మొబైల్ నెట్‌వ‌ర్క్ ఈఈ (EE) ఈ నెల 30వ తేదీ నుంచి యూకేలోని ప‌లు ప్రాంతాల్లో 5జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తేనున్న‌ట్లు తెలిపింది.

ఈఈ నుంచి 5జీ సేవ‌లు

ఈఈ నుంచి 5జీ సేవ‌లు

ముందుగా లండ‌న్‌, బ‌ర్మింగ్ హాం, కార్డిఫ్‌, మాంచెస్ట‌ర్‌, ఎడిన్‌బ‌ర్గ్‌, బెల్‌ఫాస్ట్ న‌గ‌రాల్లో 5జీ సేవ‌ల‌ను ఈఈ త‌న కస్ట‌మ‌ర్ల‌కు అందివ్వ‌నుంది. ఆ త‌రువాత నెమ్మ‌దిగా యూకేలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈఈ 5జీ సేవ‌ల‌ను అందివ్వ‌నుంది. ఈ క్ర‌మంలోనే 2019 చివ‌రి వ‌ర‌కు బ్రిస్ట‌ల్‌, కొవెంట్రీ, గ్లాస్గో, హ‌ల్‌, లీడ్స్‌, లీసెస్ట‌ర్‌, లివ‌ర్‌పూల్‌, న్యూకాజిల్‌, నాటింగ్‌హామ్‌, షెఫ్ఫీల్ట్‌ల‌లో 5జీ సేవ‌లు ల‌భిస్తాయ‌ని, ఆ త‌రువాత 2020 వ‌ర‌కు ఆబ‌ర్డీన్‌, కేంబ్రిడ్జి, డెర్బీ, గ్లూసెస్ట‌ర్‌, పీట‌ర్‌బ‌రో, ప్లైమౌత్‌, పోర్ట్స్ మౌత్‌, సౌతాంప్ట‌న్‌, వొర్సెస్ట‌ర్‌, వొల్వ‌ర్‌హాంప్ట‌న్ న‌గ‌రాల్లో ఈఈ నుంచి 5జీ సేవ‌లు ల‌భ్యం కానున్నాయి.

నెల‌కు 120 జీబీ డేటాతో

నెల‌కు 120 జీబీ డేటాతో

ఇక 5జీ నెట్‌వ‌ర్క్ ద్వారా వినియోగ‌దారులు క‌నీసం 100-150 ఎంబీపీఎస్ నుంచి గ‌రిష్టంగా 1 జీబీపీఎస్ వ‌ర‌కు ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే 2023 వ‌ర‌కు 3 ద‌శ‌ల్లో యూకే మొత్తం 5జీ సేవ‌ల‌ను అందిస్తామ‌ని ఈఈ తెలిపింది. ఇక 5జీ సేవ‌లు ప్రారంభం కాగానే క‌స్ట‌మ‌ర్ల‌కు ప‌లు ప్లాన్ల‌ను కూడా అందిస్తామ‌ని ఈఈ చెబుతున్న‌ది. నెల‌కు 120 జీబీ డేటాతో 33.99 పౌండ్ల ప్లాన్‌ను, 100జీబీ, 50జీబీ డేటా ప్లాన్ల‌ను కూడా అందుబాటులో ఉంచుతామ‌ని ఈఈ తెలిపింది.

Best Mobiles in India

English summary
Qualcomm, Lenovo working on first-ever 5G laptop, powered by Snapdragon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X