Snapdragon 875 చిప్‌సెట్‌ను అనేక వేరియంట్లలో విడుదల చేస్తున్న క్వాల్కమ్

|

స్మార్ట్‌ఫోన్‌లకు చిప్‌సెట్ లను అందించే ప్రముఖ చిప్‌సెట్ మేకర్ క్వాల్కమ్ సంస్థ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 ను అనేక వెర్షన్లలో విడుదల చేయనున్నది. ఈ సంస్కరణలలో రాబోయే ఫ్లాగ్‌షిప్ 875 చిప్‌సెట్ యొక్క 'లైట్' వేరియంట్లు కూడా ఉన్నాయి. కొత్త స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లపై సమాచారాన్ని అందించే లీక్‌లో స్నాప్‌డ్రాగన్ 960 SoC గురించి కూడా ప్రస్తావించబడింది. వీటి గురించి మరిన్ని వివరాలు తెల్సుకోవడానికి ముందుకు చదవండి.

 

స్నాప్‌డ్రాగన్ 875 చిప్‌సెట్ vs స్నాప్‌డ్రాగన్ 865 vs స్నాప్‌డ్రాగన్ 855

స్నాప్‌డ్రాగన్ 875 చిప్‌సెట్ vs స్నాప్‌డ్రాగన్ 865 vs స్నాప్‌డ్రాగన్ 855

కొన్ని రోజుల క్రితం క్వాల్కమ్ సంస్థ నుండి కొత్తగా రాబోయే స్నాప్‌డ్రాగన్ 875 చిప్‌సెట్ 2020లో విడుదల అయిన స్నాప్‌డ్రాగన్ 865 కన్నా అధిక ధరను కలిగి ఉంటుంది అని వెల్లడించారు. ఈ చిప్‌సెట్‌లో 5G-ఎనేబుల్ మాడ్యూళ్ళను బండిల్ చేసిన కారణంగా అధిక ధరను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 865 కూడా 2019 లో విడుదల అయిన స్నాప్‌డ్రాగన్ 855 కన్నా ఎక్కువ ధరను కలిగి ఉంది. దీని ఫలితంగా 2020 ఫ్లాగ్‌షిప్‌ల ధరలు ప్రజలు ఉహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది.

బహుళ వేరియంట్‌లలో స్నాప్‌డ్రాగన్ 875 ఎందుకు

బహుళ వేరియంట్‌లలో స్నాప్‌డ్రాగన్ 875 ఎందుకు

వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరలు అధికంగా ఉండటంతో స్నాప్‌డ్రాగన్ 875 యొక్క అనేక వేరియంట్లు వినియోగదారులకు చాలా అర్ధవంతంగా ఉంటాయి. ఉత్తమమైన పనితీరును కోరుకునే పవర్ యూజర్లు టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయగలుగుతారు. అయితే మరింత నిరాడంబరమైన అవసరాలను కోరుకునే వారు చిప్‌సెట్ యొక్క చౌకైన వేరియంట్‌కు అధిక మొత్తంలో చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త చిప్‌సెట్‌లు ఇప్పటికీ 800 సిరీస్‌లో ఉన్నందున అవి అధిక వేగంతో వినియోగదారులను ఆకట్టుకుంటాయి అని ఆశించవచ్చు. క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్లు అధిక వేగంతో GPU పనితీరు మరియు 5G సామర్థ్యాలను కలిగి ఉండవచ్చు.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 కొత్త చిప్‌సెట్‌
 

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 కొత్త చిప్‌సెట్‌

క్వాల్కమ్ సంస్థ దాని సాధారణ షెడ్యూల్‌లకు కట్టుబడి ఉంటే కనుక బహుశా ఈ సంవత్సరం చివరిలో సంస్థ యొక్క తరువాతి ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 875ను చూడవచ్చు. కొత్త ప్రాసెసర్ల సమూహాన్ని అభివృద్ధి చేయడానికి US- ఆధారిత సంస్థకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న పుకార్ల ప్రకారం స్నాప్‌డ్రాగన్ 875 ‘లైట్' మరియు స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ అన్నింటికంటే భిన్నమైన చిప్‌సెట్‌లుగా ఉంటుంది అని భావిస్తున్నారు. 

Best Mobiles in India

Read more about:
English summary
Qualcomm Plan to Release Snapdragon 875 Chipset in Multiple Variants!! is it True?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X