కొత్త స్నాప్‌డ్రాగన్..5 నిమిషాలతో 5 గంటలు బ్యాకప్

Written By:

మొబైల్స్ కి సంబంధించి ప్రాసెసర్లను తయారుచేసే క్వాల్‌కామ్ సంస్థ కొత్తగా స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌ను విడుదల చేసింది. దీంతో మీరు కేవలం 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే దాదాపు 5 గంటలు పనిచేసుకోవచ్చు. అంటే మీకు 5 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ప్రాసెసర్ హైలెట్స్ పాయింట్స్ ఓ సారి చూద్దాం.

వచ్చే ఏడాది నుంచే 5జీ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమితమైన బ్యాటరీ బ్యాకప్‌

క్వాల్‌కామ్ ప్రవేశపెడుతున్న స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్లు, టాబ్లెట్లు యూజర్లకు అమితమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందించనున్నాయి.

క్విక్ చార్జ్ 4.0

కేవలం కొన్ని నిమిషాలు చార్జింగ్ పెడితే చాలు, కొన్ని గంటల బ్యాకప్ వచ్చేలా చేసే క్విక్ చార్జ్ 4.0 అనే టెక్నాలజీని సదరు ప్రాసెసర్లు అందివ్వనున్నాయి.దీంతో పాటు క్విక్ ఛార్జ్ 4.0 వస్తోంది. దీంతో మీ బ్యాటరీ బ్యాకప్ ఎన్ని పనులు చేసినప్పటికీ అయిపోదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

5 గంటల బ్యాకప్

క్విక్ చార్జ్ 4.0 ఉన్న డివైస్‌లను కేవలం 5 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే చాలు, దాంతో దాదాపుగా 5 గంటల బ్యాకప్ వస్తుంది. మళ్లీ 5 గంటల తరువాతే డివైస్ ను చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది.

30 నిమిషాల పాటు

ఇక క్విక్ చార్జ్ 4.0 టెక్నాలజీ ఉన్న డివైస్ లను కేవలం 30 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే చాలు చార్జింగ్ 100 శాతం పూర్తవుతుంది. దీని వల్ల యూజర్లకు డివైస్లలో చార్జింగ్ అయిపోతుందన్న బెంగ ఉండదు.

2017 లో

2017 లో స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్లు రానున్న నేపథ్యంలో సదరు ప్రాసెసర్లతోపాటు ఈ క్విక్ చార్జ్ 4.0 టెక్నాలజీ కూడా కంబైన్డ్ గా యూజర్లకు అందుబాటులోకి రానుంది.

యూజర్లకు బ్యాటరీ బ్యాకప్ సమస్య తీరే అవకాశం

ఇప్పటి వరకు వచ్చిన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు ఉన్న ఫోన్లలో క్విక్ చార్జ్ 2.0, 3.0 టెక్నాలజీలు ఉండగా, త్వరలో రానున్న దీని కొత్త వెర్షన్తో యూజర్లకు బ్యాటరీ బ్యాకప్ సమస్య తీరుతుందనే టెక్ నిపుణులు భావిస్తున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Qualcomm Quick Charge 4: Five minutes of charging for five hours of battery life read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot