క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865Soc రిలీజ్ ఎప్పుడో తెలుసా?

|

ప్రముఖ చిప్‌మేకర్ క్వాల్‌కామ్ సంస్థ గత సంవత్సరం డిసెంబర్ నెలలో హవాయిలోని మౌయిలో జరిగిన స్నాప్‌డ్రాగన్ టెక్ సమ్మిట్‌లో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్ 855ను ప్రకటించింది. ఇప్పుడు క్వాల్‌కామ్ సంస్థ డిసెంబర్ 3, 2019 నుండి డిసెంబర్ 5 వరకు ఒక టెక్ సమ్మిట్‌ కార్యక్రమంను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం టెక్ సమ్మిట్‌లో క్వాల్‌కామ్ సంస్థ తన తదుపరి జెనరేషన్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 865ను ప్రకటించనున్నది.

 

టెక్ సమ్మిట్‌ 2018

2018 యొక్క స్నాప్‌డ్రాగన్ టెక్ సమ్మిట్‌లో క్వాల్‌కామ్ సంస్థ స్నాప్‌డ్రాగన్ 855 మరియు 5G అనే రెండు అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ సంవత్సరం కూడా 5G మీద చర్చనీయాంశ ఉండవచ్చు అని భావిస్తున్నారు. 2019 లో వన్‌ప్లస్, శామ్‌సంగ్, షియోమి, వివో మరియు మరిన్ని బ్రాండ్ల నుండి వచ్చిన అన్ని ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌తో పనిచేస్తున్నాయి.

 

Airtel Xstream Fibre: RS.699లకే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్Airtel Xstream Fibre: RS.699లకే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

స్మార్ట్‌ఫోన్‌లు

వచ్చే ఏడాది కూడా ఈ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు తన తదుపరి స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేయడం జరుగుతుందని భావిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే 2020 లో లాంచ్ అవుతున్న అన్ని ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు క్వాల్‌కామ్ యొక్క తరువాతి తరం చిప్ అకా స్నాప్‌డ్రాగన్ 865 చేత శక్తినివ్వగలవని మేము ఆశిస్తున్నాము.

గెలాక్సీ S11 సిరీస్‌
 

శామ్సంగ్ ఇప్పటికే గెలాక్సీ S11 సిరీస్‌లో ఈ చిప్ సెట్ ను ఉపయోగించడం ప్రారంభించిందని పుకార్లు సూచిస్తున్నాయి. సామ్‌సంగ్ సాధారణంగా సరికొత్త క్వాల్‌కామ్ ప్రాసెసర్‌లతో తమ ఫోన్‌లను ప్రారంభిస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటి. 2020 లో కూడా దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్సంగ్ ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తారని అందరు ఆశిస్తున్నారు.

శామ్సంగ్

శామ్సంగ్ సాధారణంగా తన గెలాక్సీ సిరీస్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ కార్యక్రమంలో ప్రారంభిస్తుంది. గెలాక్సీ ఎస్ 11 సిరీస్ కూడా ఫిబ్రవరి నెలలో జరిగే MWC 2020 లో అధికారికంగా రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.

 

BSNL నుంచి మరొక లాంగ్ టర్మ్ ప్లాన్!! రోజుకు 3GB డేటా ఆఫర్ అదుర్స్BSNL నుంచి మరొక లాంగ్ టర్మ్ ప్లాన్!! రోజుకు 3GB డేటా ఆఫర్ అదుర్స్

వన్‌ప్లస్

వన్‌ప్లస్ సంస్థ కూడా ఇప్పటికే తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 8 లో కూడా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో చిప్ సెట్ ను ప్రారంభించిందని కొన్ని పుకార్లు సూచిస్తున్నాయి. వన్‌ప్లస్ 8 వన్‌ప్లస్ 7T మరియు 7T సిరీస్ 120HZ స్క్రీన్ టెక్నాలజీతో వస్తుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభించిన వన్‌ప్లస్ ఫోన్‌లు - వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రో - 90HZ స్క్రీన్‌తో ప్రారంభమయ్యాయి. ఇది వినియోగదారులకు సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Qualcomm Snapdragon 865 SoC Launching on Dec 3

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X