Home
News

Qualcomm నుంచి స్నాప్‌డ్రాగన్ 875 కొత్త చిప్‌సెట్!! ఐఫోన్‌ను మించిన ఫీచర్లతో....

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు అధిక భాగం తమ యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో క్వాల్కమ్ యొక్క ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌లను వినియోగిస్తున్నారు. ఈ క్వాల్కమ్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త చిప్‌సెట్‌లను లాంచ్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ సంస్థ తన యొక్క తాజా చిప్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 875 ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. స్నాప్‌డ్రాగన్ 825 కి అప్ డేట్ వెర్షన్ గా వస్తున్న స్నాప్‌డ్రాగన్ 875 సిరీస్ చిప్‌సెట్‌లు వచ్చే ఏడాదిలో లాంచ్ అయ్యే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల యొక్క ప్రాసెసర్‌లలో ఉపయోగించనున్నారు. క్వాల్కమ్ నుంచి రాబోయే చిప్‌సెట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 చిప్‌సెట్ vs ఐఫోన్ కిరిన్, ఎక్సినోస్ చిప్‌సెట్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 చిప్‌సెట్ vs ఐఫోన్ కిరిన్, ఎక్సినోస్ చిప్‌సెట్

క్వాల్కమ్ యొక్క తాజా స్నాప్‌డ్రాగన్ 875 చిప్‌సెట్‌ అందరూ ఉహించినట్లుగా ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 825 కన్నా 25 శాతం వేగంగా పని చేస్తుంది అని తెలిపారు. ఈ కారణంగా ప్రాసెసర్ బెంచ్‌మార్క్‌లపై 847,868 స్కోరు సాధించింది. ఇది పోటీలో ఐఫోన్‌ల యొక్క మైళ్లురాయిని దాటింది. కొన్ని నివేదికల ప్రకారం A14 బయోనిక్‌తో ఉన్న ఐఫోన్ 12 ప్రాసెసర్ కి 660,000 స్కోరు వచ్చింది. కిరిన్ మరియు ఎక్సినోస్ వరుసగా 696,000 మరియు 693,000 స్కోరులు సాధించాయి. స్నాప్‌డ్రాగన్ 875 చిప్‌సెట్‌తో పోలిస్తే వీటి స్కోరులు తక్కువగా ఉన్నాయి. అయితే దీని యొక్క పనితీరు మరియు సామర్థ్యం గురించి పూర్తి వివరాలు తెలియాలసి ఉంది.

 

స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు

స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు

క్వాల్కమ్ సంస్థ గత సంవత్సరంలో విడుదల చేసిన స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌ యొక్క బెంచ్‌మార్క్ స్కోర్‌లతో పోలిస్తే దీని యొక్క వ్యత్యాసం పూర్తిగా బిన్నంగా ఉంటుంది. సింథటిక్ బెంచ్‌మార్క్ ఫలితాల ప్రకారం క్వాల్కమ్ యొక్క తాజా చిప్‌సెట్ ఆపిల్ యొక్క చిప్‌సెట్‌లను మించి ఉన్నాయి. ఇది అందుబాటులోకి వస్తే కనుక మన చేతుల్లో చాలా పోటీ ఉంటుంది. వీటి యొక్క పనితీరు సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్‌తో ఎలా కలిసిపోతుందో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఆపిల్ మరియు గూగుల్ సంస్థల యొక్క ఫోన్లలో ఉపయోగించే చిప్‌సెట్‌లు ప్రస్తుతం పరిశ్రమలో ఉత్తమంగా ఉన్నాయి. షియోమి, వన్‌ప్లస్ మరియు రియల్‌మి వంటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం తమ యొక్క రాబోయే చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నాయి. కాబట్టి చిప్‌సెట్ తయారీదారు కోసం ఇది ఎలా ఉపయోగపడుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

క్వాల్కమ్ వేరియంట్ తో రియల్‌మి C15 లాంచ్

క్వాల్కమ్ వేరియంట్ తో రియల్‌మి C15 లాంచ్

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో రియల్‌మి సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్లకు మంచి స్థానం కలిగి ఉంది. ఇతర బ్రాండ్ల మాదిరిగానే ఇది కూడా ఇప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తున్నది. ఈ ప్రయత్నాలలో భాగంగా సంస్థ నుంచి రాబోయే సరికొత్త రియల్‌మి C15 ఫోన్ క్వాల్కమ్ యొక్క కొత్త ఎడిషన్‌తో చూడవచ్చు. మీడియా టెక్ చిప్‌లో నడుస్తున్న ఫీచర్-రిచ్ సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా C15 కొన్ని నెలల క్రితం ప్రారంభించింది. ఇప్పుడు రియల్‌మి క్వాల్కమ్ ఎడిషన్‌ను అదనపు వేరియంట్‌గా ప్రవేశపెట్టింది. ఇది సూచించినట్లుగా క్వాల్‌కామ్ ఎడిషన్ ఒరిజినల్ మీడియాటెక్ హెలియో G35 కు బదులుగా స్నాప్‌డ్రాగన్ 460తో పొందుతుంది.

Best Mobiles in India

English summary
Qualcomm Snapdragon 875 New Chipset Coming Soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X