Snapdragon 888 5G SoC: 2021 ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 888 5G చిప్ సెట్

|

స్మార్ట్‌ఫోన్‌ యొక్క సంస్థలకు చిప్‌సెట్ లను అందించే ప్రముఖ చిప్‌మేకర్ క్వాల్‌కామ్ టెక్నాలజీస్ కొత్తగా స్నాప్‌డ్రాగన్ 888 5G మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 888 5G చిప్ సెట్ అందుబాటులోకి రానున్నది. చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ షియోమి కొత్తగా విడుదల చేయనున్న Mi 11 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 5G Socతో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G యొక్క ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G ఫీచర్స్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G ఫీచర్స్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G అనేది టాప్-ఆఫ్-ది-లైన్ చిప్‌సెట్ కావడంతో ఇది మొబైల్ ప్లాట్‌ఫాం వినియోగదారులకు ప్రీమియం అనుభవాలను అందిస్తుంది. దీని యొక్క సిస్టమ్-ఆన్-చిప్ 3వ తరం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ X60 5G మోడెమ్-RF వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన బ్యాండ్‌లలో mmWave మరియు Sub-6 లను అందించడం ద్వారా గ్లోబల్ 5G మద్దతును అనుమతిస్తుంది. ఇది 5G క్యారియర్ అగ్రిగేషన్, గ్లోబల్ మల్టీ-సిమ్ మరియు నాన్-స్టాండలోన్ మరియు డైనమిక్ స్పెక్ట్రమ్ షేరింగ్ (DSS) ఫీచర్లకు మద్దతును ఇస్తుంది.

 

Also Read: Samsung స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి కొత్త స్కీమ్!! రివార్డులు కూడా...Also Read: Samsung స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి కొత్త స్కీమ్!! రివార్డులు కూడా...

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G షడ్భుజి ప్రాసెసర్‌
 

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G షడ్భుజి ప్రాసెసర్‌

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G చిప్‌సెట్ మెరుగైన 5G కనెక్టివిటీ మద్దతుతో వస్తుంది. ఇది 6వ తరం క్వాల్‌కామ్ AI ఇంజిన్‌ను పూర్తిగా రీ-డిజైన్ చేసిన క్వాల్కమ్ షడ్భుజి ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిని మునుపటి తరంతో పోల్చితే కొత్త షడ్భుజి ప్రాసెసర్ AIలో పెద్ద ఎత్తును తీసుకుంటుందని క్వాల్కమ్ తెలిపింది. సెకనుకు 26టెరా ఆపరేషన్లలో (TOPS) మెరుగైన పనితీరును మరియు శక్తి సామర్థ్యంను కలిగి ఉంటుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G గేమింగ్ ఫీచర్స్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G గేమింగ్ ఫీచర్స్

గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి క్వాల్కమ్ తన స్నాప్‌డ్రాగన్ 888 5Gలో అనేక కొత్త ఫీచర్లను జోడించింది. స్నాప్‌డ్రాగన్ 888 5G SoC 3వ తరం స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్‌ను కలిగి ఉంది. ఇది మొబైల్ గేమ్ లలో సెకనుకు 144 ఫ్రేమ్‌లను (fps) అందించగలదు. అలాగే దీని యొక్క GPU పనితీరును అడ్రినో 660 GPU నిర్వహిస్తుంది. అడ్రినో జిపియు సిరీస్ లో అడ్రినో 660 జిపియు అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్ అని క్వాల్కమ్ తెలిపింది.

స్నాప్‌డ్రాగన్ 888 5G గిగాపిక్సెల్ స్పీడ్ ఫీచర్స్

స్నాప్‌డ్రాగన్ 888 5G గిగాపిక్సెల్ స్పీడ్ ఫీచర్స్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5Gలో వేగవంతమైన గిగాపిక్సెల్ స్పీడ్ క్వాల్కమ్ స్పెక్ట్రా ISP కలిగి ఉంటుంది. దీని సాయంతో వినియోగదారులు సెకనుకు 2.7 గిగాపిక్సెల్స్ వద్ద లేదా 12MP రిజల్యూషన్ వద్ద సుమారు 120 ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. అంటే మునుపటి తరంతో పోలిస్తే ఇది 35% అధిక వేగంగా ఉంది. స్నాప్‌డ్రాగన్ 888 5G ఆపిల్ యొక్క A14 బయోనిక్ చిప్ మాదిరిగానే 5nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5Gను ఉపయోగించే స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5Gను ఉపయోగించే స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G చిప్ సెట్ ను అందరి కంటే ముందుగా షియోమి సంస్థ తన Mi11 తో వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా డిసెంబర్‌ చివరిలో ప్రపంచవ్యాప్త విడుదల చేయనున్నది. షియోమితో పాటుగా ఇతర సంస్థలు ఆసుస్, బ్లాక్ షార్క్, లెనోవా, ఎల్‌జి, మీజు, మోటరోలా, నుబియా, రియల్‌మి, వన్‌ప్లస్, ఒప్పో, షార్ప్, వివో మరియు ZTE సంస్థలు కూడా తమనుంచి 2021ఏడాదిలో విడుదల అయ్యే ఫోన్‌లలో దీనిని వినియోగించనున్నారు.

Best Mobiles in India

English summary
Qualcomm Snapdragon 888 5G Chipset Comes on 2021 Flagship Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X