Home
News

ప్రశ్నార్థకంగా మారిన 10కోట్ల మంది వినియోగదారుల భద్రత

ఫేస్‌బుక్‌లో డేటా లీక్‌ ఉదంతం ప్రకంపనలు ఇంకా సమసిపోకముందే తాజాగా డేటా బ్రీచ్‌ ఆందోళన పుట్టిస్తోంది. పది కోట్ల మంది డేటా ప్రమాదంలో పడిందా అనే అనుమానాలు ఇప్పుడు తెగ ఆందోళన కలిగిస్తున్నాయి.

ఫేస్‌బుక్‌లో డేటా లీక్‌ ఉదంతం ప్రకంపనలు ఇంకా సమసిపోకముందే తాజాగా డేటా బ్రీచ్‌ ఆందోళన పుట్టిస్తోంది. పది కోట్ల మంది డేటా ప్రమాదంలో పడిందా అనే అనుమానాలు ఇప్పుడు తెగ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రముఖ వెబ్ సైట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ (క్వోరా) సైట్ హ్యాకింగ్ గురై వినియోగదారుల సమాచారం చోరీకి గురైందనే విషయం ఇప్పుడు సోల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని నిజం చేస్తూ తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందని విషయాన్ని స్వయంగా క్వోరా వెల్లడించింది. అందువల్ల క్వోరా ఖాతాదారులు వెంటనే పాస్ వర్డ్ లు మార్చుకోవాలని సూచించింది. అలాగే హ్యాకింగ్‌కు గురైన వినియోగదారులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిపింది.

10కోట్ల మంది వినియోగదారుల డేటా చోరీ

10కోట్ల మంది వినియోగదారుల డేటా చోరీ

ప్రముఖ వెబ్‌సైట్‌ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ (క్వోరా) కు సంబంధించిన సుమారు 10కోట్ల మంది వినియోగదారుల డేటా చోరీ అయిందని కంపెనీ పేర్కొంది. నవంబరు 30న దీన్నిగుర్తించామని వెల్లడించింది.

థర్డ్ పార్టీ సైట్ ద్వారా..

థర్డ్ పార్టీ సైట్ ద్వారా..

గుర్తు తెలియని హ్యాకర్లు థర్డ్ పార్టీ సైట్ ద్వారా తమ సైట్ లోకి చొరబడి డేటా చోరీ చేశారని వివరించింది. పేరు, ఈమెయిల్ చిరునామా, ఎన్‌క్రిప్టెడ్ పాస్ వర్డ్ లు, లింక్డ్ నెట్‌వర్క్ లో రిపోర్ట్‌ చేసిన డేటాతో సహా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించారని క్వోరా కంపెనీ సీఈవో ఆడమ్‌ డీ ఎంజేలో వెల్లడించారు.

 

 

యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ

యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ

గుర్తు తెలియని హ్యాకర్లు "ఒక హానికర మూడవ పక్షం" ద్వారా తమ వ్యవస్థలోకి చొరబడ్డారని ప్రకటించింది. పేరు, ఇమెయిల్ చిరునామా, ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌లు, లింక్డ్ నెట్‌వర్క్‌లో రిపోర్ట్‌ చేసిన డేటాతో సహా చోరి యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని కంపెనీ సీఈవో ఆడమ్‌ డీ ఎంజేలో తన బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించారు.

 

 

తమ పాస్ వర్డ్ లు మార్చుకోవాలని

తమ పాస్ వర్డ్ లు మార్చుకోవాలని

ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని తెలిపిన ఆయన వినియోగదారులు వెంటనే తమ పాస్ వర్డ్ లు మార్చుకోవాలని స్పష్టంచేశారు. అలాగే హ్యాకింగ్‌కు గురైన వినియోగదారులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిపింది.

 

 

ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగులు

ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగులు

ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగులు ఆడమ్‌ డీఎంజేలో, చార్లీ చీవర్‌ 2009లో క్వోరా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశారు. సోషల్‌ మీడియాలో సహా పలు రంగాల్లోని ప్రశ్నలకు జవాబు అందించేలా దీన్ని అభివృద్ధి చేశారు. కాగా అతితక్కువ కాలంలోనే ఈ వెబ్‌సైట్‌ అత్యంత ఆదరణ పొందింది.

Best Mobiles in India

English summary
Quora hit by data breach affecting around 100 million users more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X