‘డేంజరస్’ సెల్ టవర్లు!

Posted By: Prashanth

Radiation From Mobile Phones and Towers Harm you?

 

‘సెల్ టవర్ల నుండి వెలువడే రేడియోధార్మిక కిరణాల వల్ల తలనొప్పి, వినికిడి లోపం, కండరాల లోపం, మానసిక ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం లాంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికి జనావాసాల మధ్య సెల్‌ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ చర్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది.’

పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని జనావాసాల మధ్య ఆయా టెలికామ్ ఆపరేటర్లు ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్లు రేడియోషన్‌ను వెదజల్లటంతో ప్రజాఆరోగ్యానికి ముప్పువాటిల్లే పరిస్థితులు నెలకున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, ఒడాఫోన్‌, ఐడియా, టాటా ఇండికాం తదితర కంపెనీలకు చెందిన టవర్లు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిని జనవాసాల మధ్య ఏర్పాటు చేయటంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు చర్మ క్యాన్సర్, గుండె, మెదుడుకు సంబంధించిన దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు.

టవర్ల ఏర్పాటులో భాగంగా అధికారుల మందుచూపుతనం కొరవడటంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొవల్సిన పరిస్థితి నెలుకుంది. టవర్‌లను తొలగించాలంటూ ప్రజలు, పర్యావరణ సంఘాలు చేపడుతున్న ఆందోళణల పై సంబంధిక అధికారులు స్పందన కొరవడింది. ప్రలోభాలకు లొంగుతున్న అధికారలు నిబంధనలకు విరుద్ధంగా టవర్లకు అనుమతులను మంజూరు చేస్తున్నారని బాధితులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన టవర్ల వల్ల కలిగుతున్న దుష్పరిణామాలను గ్రహించి జనవాసాలేని ప్రాంతాల్లో టవర్‌లను నెలకొల్పాలని ప్రభుత్వానికి మెర పెట్టకుంటున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot