ఫైలిన్ తుఫాన్: వందలాది మంది ప్రాణాలను కాపాడిన రేడియో అలర్ట్!

Posted By:

అవి భయానక ఫైలిన్ తుఫాన్ భారత దేశపు తూర్పు తీరానికి చేరువవుతున్న గడియలు. బీచ్ టౌన్ (పూరీ) సముద్ర తీరానికి రెండు కిలోమీటర్ల చేరువలో ఉన్న గజేంద్ర జీనా (55) రేడియో ద్వారా తుఫాన్ అప్‌డేట్‌లను తెలుసుకుంటూ తన కుటుంబంతో ఉన్నారు. సముద్ర తీరానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న జనభా తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ జారీఅయిన భయానక రేడియో అప్‌డేట్ గజేంద్ర జీనా కుటుంబాన్ని మరింత కలవరపాటుకు గురిచేసింది. అప్పటికే నిత్యవసర సామాగ్రిని సిద్ధం చేసుకున్న జీనా తన భార్య, ఇద్దురు చిన్నారులతో కలిసి పునరావాస కేంద్రానికి వెళ్లిపాయారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫైలిన్ తుఫాన్: వందలాది మంది ప్రాణాలను కాపాడిన రేడియో అలర్ట్!

ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటిలోనే భయానక ఫైలిన్ గజేంద్రీ జీనా నివాసముంటున్న ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. తుఫాన ఉధృతికి ఇళ్లన్ని పూర్తి నేలమట్టమయ్యాయి. తనవద్ద రేడియో లేకుంటే తుఫాను ధాటికి తమ కటుంబమంతా బలిఅయి ఉండేవాళ్లమని గజేంద్ర జీనా వెల్లడించారు. ఒక జీనా కుటంబమే కాదు ఒర్సిస్సా సముద్ర తీర ప్రాంతాల్లో నివాసముంటున్న వందలాది కుటంబాలు కేవలం రేడియో హెచ్చరికల ద్వారానే అప్రమత్తం కాగలిగాయి. ఫైలిన్ తుఫాన్ నేపధ్యంలో ఆల్ ఇండియా రేడియో మరింత అప్రమత్తమైన నిరంతరాయంగా తుఫాన్ అలర్ట్ లను తీర ప్రాంత ప్రజలకు అందిస్తూనే ఉంది.

ఇందుకు అవసరమైన సరంజామాను ఆల్ ఇండియా రేడియో ముందుగాను సిద్ధం చేసుకుంది. భవనేశ్వర్ లోని ఫిలిప్ప్ రేడియోల విక్రయదారు అరుణ్ సుబుద్ధి స్పందిస్తూ తుఫాన్ కు కొద్ది గంటల ముందు తాను 600 రేడియో సెట్ లను విక్రయిచగలిగానని, ఇవి కేవలం తుఫాన్ అలర్ట్ లను తెలుసుకునేందుకు విక్రయించినవని ఆయన తెలిపారు. తుఫాన్ సమాచారాన్నితీర ప్రాంత ప్రజలకు చేరువచేయటంలో రేడియోలతో పాటు మొబైల్ నెట్‌వర్క్‌లు కీలక పాత్ర పోషించాయి. ప్రభుత్వం టెలికామ్ ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ అక్టోబర్ 11, 12 తేదీల్లో 15 లక్షల మందికి తుఫాన్ సమాచారాన్ని ఎస్ఎంఎస్‌ రూపంలో అందించినట్లు బీఎస్ఎన్ఎల్ ఒడిస్సా సర్కిల్ జనరల్ మేనేజర్ (మొబైల్) బలరామ్ పాల్ తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot