రైల్వే బడ్జెట్ 2013: ఐఆర్‌సీటీసీ పునరుద్ధరణ ఇంకా ఉచిత వై-ఫై‌ పై మంత్రి హామి

Posted By:

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మంగళవారం మధ్యాహ్నం 2013-14 సంవత్సారానికి‌గాను రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో భాగంగా ఈ-టికెటింగ్ సిర్వీస్‌ను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. రైల్వే ఆన్‌లైన్ బుకింగ్‌కు తోడ్పడుతున్న ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను మరింత మెరుగుపరిచే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి స్ఫష్టం చేసారు. ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి ఈ-టికెటింగ్ వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నట్లు బన్సల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

సరికొత్త ఈ-టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రావటం వల్ల ఐఆర్‌సీటీసీ ద్వారా నిమిషానికి 7,200టికెట్‌లను పొందవచ్చని అన్నారు. ప్రస్తుత ఐఆర్‌సీటీసీ పనితీరును పరిశీలించినట్లయితే నిమిషానికి కేవలం 2,000 టికెట్‌లను మాత్రమే అందించగలగుతుంది. అదేవిధంగా రాబోయే ఈ - టికెటింగ్ వ్యవస్థ, ఐఆర్‌సీటీసి వెబ్‌సైట్‌ను ఏకకాలంలో లక్షమందిని సపోర్ట్ చేసేవిధంగా తీర్చిదిద్దుతుందని బన్సల్ అన్నారు.

ఐఆర్‌సీటీసీ పునరుద్ధరణ ఇంకా ఉచిత వై-ఫై‌ పై మంత్రి హామి

ప్రస్తుత ఐఆర్‌సీటీసీ పనితీరును పరిశీలించినట్లయితే ఏకకాలంలో కేవలం 20,000 మందిని మాత్రమే సపోర్ట్ చేయగలదు. అలాగే పలు ప్రత్యేక రైళ్లలో ఉచిత వై-ఫై సర్వీస్‌లను అందించనున్నట్లు మంత్రీ హామి ఇచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ-టికెటింగ్ వ్యవస్థను మొబైల్ ఫోన్‌లలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot