ఉచితంగా OTTల‌తో అన్‌లిమిటెడ్ ప్లాన్ల‌ను విడుద‌ల చేసిన RailTel!

|

భార‌త రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నెట్‌వ‌ర్క్ సంస్థ RailTel త‌మ వినియోగ‌దారుల‌కు స‌రికొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్ల‌ను ప్ర‌క‌టించింది. అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో పాటు ఉచితంగా ప‌లు OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్ వంటి ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ ఆఫర్‌లను ప్రకటించింది. పాత మ‌రియు కొత్త‌ RailWire వినియోగదారులు అపరిమిత డేటా క‌లిగిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ని ఎంచుకున్నప్పుడు, దాంతో పాటుగా గరిష్టంగా 13 OTT ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన‌ ఉచిత స‌బ్‌స్క్రిప్ష‌న్ పొందనున్నారు.

 
ఉచితంగా OTTల‌తో అన్‌లిమిటెడ్ ప్లాన్ల‌ను విడుద‌ల చేసిన RailTel!

ఈ నూత‌న అన్‌లిమిటెడ్ ప్లాన్ల‌ను రైల్‌వైర్ సత్రాంగ్ (Railwire SATRANG) ప‌థ‌కం కింద కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కంపెనీ ప్ర‌తినిధి మాట్లాడుతూ.. రైల్‌టెల్ అందిస్తున్న‌ ఈ ఓటీటీ ఆఫ‌ర్ ప్లాన్ చాలా త‌క్కువ ఖ‌ర్చుతో కూడుతున్న‌ది. అదే వినియోగ‌దారులు ఆ ఓటీటీల‌ను ప్ర‌త్యేకంగా కొనుగోలు చేయాలంటే చాలా ఎక్కువ డ‌బ్బు చెల్లించాల్సి వ‌స్తుంది. కానీ, రైల్‌టెల్ ఇస్తున్న ఈ ఆఫ‌ర్‌తో త‌క్కువ ధ‌ర‌కే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌తో పాటు ఓటీటీ సేవ‌ల్ని కూడా ఆస్వాదించ‌వ‌చ్చు అని తెలిపారు. ఓటీటీల‌తో పాటు రైల్‌టెల్ కంపెనీ 150 టీవీ ఛానెల్స్ ను కూడా అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

రైల్‌వైర్ స‌త్రాంగ్ (Railwire SATRANG) ప‌థ‌కం కింద బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో అందించే ఓటీటీలు ఇవే:
* అమెజాన్ ప్రైమ్ వీడియో
* డిస్నీ + హాట్‌స్టార్‌
* జీ5
* సోనీ లైవ్‌
* హంగామా మూవీస్‌
* హంగామా మ్యూజిక్ ప్రో
* వూట్‌
* ఆల్ట్ బాలాజీ
* ఆహా తెలుగు
* ఇరోస్ నౌ
* స‌న్ నెక్స్ట్‌
* ఎపికాన్‌
* ఎంఎక్స్ ప్లేయ‌ర్

దేశవ్యాప్తంగా ఉన్న 4.65 లక్షల మంది రైల్‌వైర్ వినియోగదారులకు అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ (స్పీడ్ క్యాప్డ్) మరియు OTT సబ్‌స్క్రిప్షన్‌లను అందించే బహుళ ప్లాన్‌లు త‌మ వ‌ద్ద అందుబాటులో ఉన్నాయని రైల్‌టెల్ ధృవీకరించింది. ప్రస్తుతానికి, ఈ సేవలు అన్ని అపరిమిత రైల్‌వైర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లకు అందుబాటులో ఉంటాయా లేదా ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఉప‌యోగిస్తున్న వారికి మాత్ర‌మే ప‌రిమిత‌మా అనే విష‌యంపై ఇంకా ఇప్ప‌టి వ‌ర‌కు కంపెనీ నుంచి స‌మాచారం లేదు.

ఉచితంగా OTTల‌తో అన్‌లిమిటెడ్ ప్లాన్ల‌ను విడుద‌ల చేసిన RailTel!

ప్రస్తుతం, RailWire ప‌లు బహుళ అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది. అత్యంత త‌క్కువ ధ‌ర క‌లిగిన అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.499 కి 10Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగం నెట్ అందిస్తోంది. అయితే RailWire నుండి అత్యంత ఖరీదైన అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.1,899 కి 200Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంను అందిస్తోంది.

RailWire SATRANG ప్లాన్‌ల విషయానికి వస్తే, కంపెనీ సాధారణ రిటైల్ అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కంటే కొంచెం ఎక్కువ వసూలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే, Disney+ Hotstar స‌బ్‌స్క్రిప్ష‌న్‌ RailWire SATRANG ప్లాన్ యొక్క అన్ని వేరియంట్‌లకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. OTT సబ్‌స్క్రిప్షన్‌తో RailWire SATRANG అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర మరియు లభ్యతకు సంబంధించిన వివరాలు త్వరలో RailTel అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ రూపొందించిన‌ట్లు కంపెనీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

 
ఉచితంగా OTTల‌తో అన్‌లిమిటెడ్ ప్లాన్ల‌ను విడుద‌ల చేసిన RailTel!

రైల్‌టెల్ డైరెక్టర్ (ఫైనాన్స్) ఆనంద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, "రైల్‌వైర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించడానికి మరియు దాని నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు సర్వీస్ ఆఫర్‌లను బలోపేతం చేయడం ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రైల్‌టెల్ కట్టుబడి ఉంది" అని ఆయ‌న తెలిపారు. "ఈ కొత్త OTT బండిల్ ప్లాన్‌లు రైల్‌వైర్ సబ్‌స్క్రైబర్‌లకు పెద్ద ఆకర్షణగా నిలుస్తాయి. మరియు రైల్‌టెల్ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచడంలో సహాయపడతాయి. రైల్‌వైర్ బ్రాడ్‌బ్యాండ్ సేవ చాలా సరసమైనది మరియు 48% కంటే ఎక్కువ మంది గ్రామీణ సబ్‌స్క్రైబర్లకు ఈ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి." అని సింగ్ చెప్పారు.

Best Mobiles in India

English summary
RailTel Announces RailWire SATRANG Unlimited Broadband Plans With Complimentary OTT Subscription

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X