రైల్వే మరో కీలక నిర్ణయం.. రిజర్వ్‌డ్ జనరల్ టికెట్ల బుకింగ్ కూడా ఆధార్ తప్పనిసరి..!!
IRCTC New Rule OCT 1 : భారతీయ రైల్వే ఇటీవల కొంత కాలంగా ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక కీలక చర్యలు తీసుకుంటోంది. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదలతోపాటు టికెట్లు బుకింగ్ సమస్యలను క్రమంగా పరిష్కరిస్తోంది. ముఖ్యంగా రైల్వేలో తత్కాల్ టికెట్లు అంటే సాధారణ ప్రయాణికులకు సుమారుగా అందరి ద్రాక్ష గానే ఉండేది. ఈ తరహా సమస్యలకు రైల్వే ఇటీవల కాలంలో చెక్ పెట్టింది.
ఇప్పటికే అమల్లోకి వచ్చిన రూల్స్ :
ఈ సంవత్సరం జులై 1 నుంచి ఆధార్ వెరిఫైడ్ IRCTC యాప్, వెబ్‌సైట్ యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసేలా మార్పులు చేసింది. అనంతరం జులై 15 నుంచి తత్కాల్ బుకింగ్ కోసం ఆధార్ కార్డుకు జతచేసిన ఫోన్ నంబర్‌కు వచ్చిన OTP ను కూడా ఎంటర్ చేసే నిబంధనను తీసుకొచ్చింది.

ఈ నిబంధనలతో అవసరం అయిన వారికే టికెట్లు లభిస్తాయని భావించింది. దీంతోపాటు ఏజెంట్లకు తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లోనూ మార్పులు చేసింది. రోజూ ఉదయం 10 గంటలకు AC తత్కాల్ కోటా, 11 గంటలకు Non AC తత్కాల్ కోటా టికెట్ల బుకింగ్ ప్రారంభం అవుతుంది.
తాజాగా మరో కీలక నిర్ణయం :
అయితే ఏజెంట్లు ఆయా సమయాల్లో తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయకుండా నియంత్రించింది. ఉదయం 10:30 AC తత్కాల్ టికెట్లు, 11:30 గంటలకు Non AC టికెట్లు బుకింగ్ చేసేలా మార్పులు చేసింది. అయితే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రైల్వే సాధారణ రిజర్వేషన్ టికెట్లకు కూడా ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. బుకింగ్ ప్రారంభం అయిన తొలి 15 నిమిషాల పాటు ఆధార్ వెరిఫైడ్ IRCTC యాప్, వెబ్‌సైట్ యూజర్లు మాత్రమే టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
రైల్వే (Indian Railway) తీసుకున్న తాజా నిర్ణయం అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం సాధారణ టికెట్లను 60 రోజుల ముందుగా బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు ఈ బుకింగ్ ప్రారంభం అవుతుంది. అయితే బుకింగ్ ప్రారంభం అయిన వెంటనే దళారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అన్ని టికెట్లు బుకింగ్ చేసేస్తున్నారు.
దీంతో అవసరం అయిన సామాన్య ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉండడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొనే రైల్వో బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది. భారతీయ రైల్వే అన్ని బోర్డులకు ఈ సమాచారం చేరవేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
* రైల్వేలో అన్ని సేవల కోసం రైల్వేవన్ పేరుతో ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఉన్న IRCTC యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా కూడా కొత్త యాప్‌లోకి లాగిన్ కావచ్చు. టికెట్ల బుకింగ్, ట్రైయిన్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదులు సహా ప్లాట్‌ఫాం టికెట్ల బుకింగ్ కూడా ఈ యాప్ నుంచే చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications