టికెట్ల బుకింగ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయకుంటే..!
Indian Railway Rules : రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం ఇటీవల అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా టికెట్లు బుకింగ్ వ్యవస్థలు కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసిన IRCTC వైబ్‌సైట్, యాప్‌లో టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అనుమతి ఇస్తోంది. తత్కాల్ టికెట్లకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి అడ్వాన్సడ్ రిజర్వేషన్ పిరియడ్ (ARP) టికెట్ల బుకింగ్ కోసం కూడా ఆధార్ అథెంటికేషన్ విధానాన్ని తీసుకొచ్చింది.
ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభం కానుండగా.. :
ఈ విధానంలో నిజంగా టికెట్లు అవసరం అయిన ప్రయాణికులకు మాత్రమే టికెట్లు లభించేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం 60 రోజుల ముందుగా టికెట్ల బుకింగ్ ప్రారంభం అవుతోంది. టికెట్ల బుకింగ్ ప్రారంభం అయిన తొలిరోజు 8 గంటల నుంచి రైల్వే టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చు.

తొలి దశలో 15 నిమిషాల వరకు కట్టడి :
అయితే ఈ విధానం తీసుకొచ్చిన తొలి రోజుల్లో తొలి 15 నిమిషాల వరకు అంటే ఉదయం 08:15 AM వరకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తిచేసిన IRCTC యాప్, వైబ్‌సైట్ యూజర్లు మాత్రమే రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. అనంతరం రెండో దశలో బుకింగ్ ప్రారంభం అయిన తొలిరోజు ఉదయం 8 నుంచి 10 గంటలకు ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే టికెట్ల బుకింగ్‌కు అవకాశం కల్పించింది.
తాజాగా కీలక నిర్ణయం :
తాజాగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్ల బుకింగ్ ప్రారంభం అయిన రోజు (ARP) ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కేవలం ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసిన IRCTC యాప్, వైబ్‌సైట్ యూజర్లకు మాత్రమే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన కీలక వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. తేదీల వారీగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. డిసెంబర్ 29 వ తేదీ నుంచి ఈ నిబంధనలు క్రమంగా అమల్లోకి వస్తాయి. ఈ తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
జనవరి 5, 2026 వ తేదీ నుంచి ARP టికెట్ల బుకింగ్ ప్రారంభం అయిన రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేస్తుకున్న యూజర్లు మాత్రమే IRCTC యాప్, వైబ్‌సైట్‌లో టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
ఏకంగా అర్ధరాత్రి వరకు వారికి నో ఛాన్స్ :
అదే జనవరి 12 వ తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కేవలం ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసిన యూజర్లు మాత్రమే టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అనుమతి ఉంటుంది. ఈ విధానంలో నిజంగా టికెట్లు కావాల్సిన వారికే లభిస్తాయని అంచనా వేస్తోంది.
గతంలో నకిలీ ఐడీలతో రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకొని, ఇతరులకు అధిక ధరకు విక్రయించేవారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిజంగా టికెట్లు కావాల్సిన వారికి లభించడం లేదని విమర్శలు వచ్చాయి. దీంతో రైల్వే శాఖ ఆధార్ వెరిఫికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం కూడా ఆధార్ అథెంటికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








