భారత ఐటీ రంగంలో రాజస్ధాన్‌ ఇంజనీర్ల జోరు

Posted By: Super

భారత ఐటీ రంగంలో రాజస్ధాన్‌ ఇంజనీర్ల జోరు

జైపూర్‌: రాజస్థాన్‌కు చెందిన ఇంజనీరింగ్‌ కాలేజీల హవా ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. దేశం లోని అతి పెద్ద ఐటీ కంపెనీలైన టీసీఎస్‌ లాంటి దిగ్గజాలయిన కంపెనీలు రాజస్థాన్‌కు చెందిన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లను పెద్ద సంఖ్యలో ఎంపిక చేసింది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో భాగంగా రాజస్థాన్‌లో ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ అభ్యర్థులను రిక్రూట్‌ చేసింది. మొత్తం 360 మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసింది.

వారి లో 9 మంది ఎంసీఏ విద్యార్థులున్నారు. జైపూర్‌, బీకానీర్‌లోని టాప్‌ ఇంజినీ రింగ్‌ కాలేజీల్లో ఇటీవల రోజంతా ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూలో జరిగాయని టీసీ ఎస్‌ హెచ్‌ఆర్‌ వర్గాలు తెలియజేశాయి. ఎంపిక విద్యార్థుల్లో 267 మంది జైపూ ర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ అండ్‌ రీసెర్చి సెంటర్‌ (జెఈసీఆర్‌సీ) - జైపూర్‌ కాగా 80 మంది ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ బీకానీర్‌ నుంచి ఎంపికయ్యారని అర్పిత్‌ అగర్వాల్‌ (జెఈసీఆర్‌సీ) మాట్లాడుతూ ఏకంగా 267 మంది విద్యార్థులను ఒక కంపెనీ రిక్రూట్‌ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదలిసారని చెప్పారు.

ఈ ఉత్సాహంతో రాష్ట్రంలో సాంకేతిక విద్య మరింత పుంజుకుంటుం దని అగర్వాల్‌ చెప్పారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యను ప్రారంభించి కేవలం పది సంవత్సరా లైందన్నారు. ఐటీరంగంతో పాటు తయారీ రంగంలో కూడా రిక్రూట్‌మెంట్‌ పెద్ద ఎత్తున జరుగుతుందని.. ఐటీ రంగంలో రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వేతనాలు ఇస్తున్నారని ఎస్‌ కెసింగ్‌, డైరెక్టర్‌ పూర్ణిమ గ్రూపు ఆఫ్‌ కాలేజేస్‌ జైపూర్‌ తెలిపారు. రాజస్థానలో ప్రస్తుతం 130 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయని వాటిలో 51 జైపూర్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot