రజనీకాంత్ ‘కొచ్చాడియన్’ మొబైల్ ఫోన్!

Posted By: Prashanth

రజనీకాంత్ ‘కొచ్చాడియన్’ మొబైల్ ఫోన్!

 

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో త్వరలో విడుదల కాబోతున్న తమిళ సినిమా ‘కొచ్చాడియన్’.. ఈ చిత్రంలో రజనీ సరసన బాలీవుడ్ అందాల భామ దీపకా పడుకొన్ నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ పర్యవేక్షణలో రజనీ ముద్దుల కూతురు సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ఇంతకీ కొచ్చాడియన్ తో ‘గిజ్‌బాట్’కు పనేంటని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నామండి. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ మరో సంస్థ మీడియా వన్.. కార్బన్ మొబైల్స్‌తో జతకట్టి 5లక్షల కొచ్చాడియన్ మొబైల్ ఫోన్‌లను తయారు చేశారు. వీటిని టోక్యోలో నిర్వహించనున్న కొచ్చాడియన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో విడుదల చేస్తారు.

ఈ మొబైల్ ఫోన్‌లో కొచ్చాడియన్ సినిమాకు సంబంధించి ప్రత్యేకమైన ఫోటోలు, స్ర్కీన్ సేవర్‌లతో పాటు సిగ్నేచర్ ట్యూన్ అదేవిధంగా ట్రైలర్‌ను నిక్షిప్తం చేశారు. అంతేకాదండోయ్!! ఈ ఐదు లక్షల ఫోన్‌ల పై రజనీకాంత్ డిజిటల్ సంతకం కూడా ఉంటుంది. డిసెంబర్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్రం తమిళంతో పాటు హిందీ, తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ వర్షన్‌లలో విడుదల కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot