మొబైల్ తయారీపై తక్కువ ఖర్చు పెట్టి కోట్ల లాభాలను కొల్లగొట్టిన చైనా కంపెనీలు !
దేశంలో స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కంపెనీలు దాన్ని బాగా క్యాష్ చేసుకున్నాయి.
దేశంలో స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కంపెనీలు దాన్ని బాగా క్యాష్ చేసుకున్నాయి. మొబైల్ తయారీపై తక్కువ ఖర్చుని పెట్టి కోట్ల లాభాలను గడించాయి. ఒక్కో యూనిట్ విక్రయంతో, కంపెనీలు పొందే లాభాలు భారీ ఎత్తునే ఉన్నాయంటూ రీసెర్చ్ కంపెనీ కౌంటర్ పాయింట్ తాజా సర్వే ర్యాంకింగ్స్‌ను బట్టి తెలుస్తోంది. మొన్నటిదాకా ఇండియాలో ఆపిల్, శాంసంగ్ కంపెనీలు మాత్రమే లాభాలను కొల్లగొట్టగా ఇప్పుడు అదే బాటలో చైనా కంపెనీలు కూడా చేరాయి.

ఆపిల్
ఆపిల్ 60 శాతం షేరుతో మొబైల్ హ్యాండ్‌సెట్ ఇండస్ట్రీ లాభాల్లో ప్రముఖ స్థానం సంపాదించింది. ఒక్కో ఐఫోన్ విక్రయంతో ఆపిల్ 150 డాలర్ల లాభాన్ని ఆర్జించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది.

శాంసంగ్
నోట్ 8 సిరీస్, గెలాక్సీ ఎస్8 సిరీస్‌తో ఈ ఏడాది శాంసంగ్ చాలా బలంగా మార్కెట్‌లోకి వచ్చింది. గెలాక్సీ నోట్7తో 2016 మూడో క్వార్టర్‌లో నష్టాలను పొందినప్పటికీ, ఈ కంపెనీ మంచి లాభాలనే పొందినట్టు తెలిసింది. నోట్8, జే సిరిస్ స్మార్ట్‌ఫోన్లకు మంచి డిమాండ్ ఉన్నట్టు ఈ కంపెనీ పేర్కొంది.

హువాయి
2017 క్యూ3లో ఏడాది ఏడాదికి హువాయి కంపెనీ లాభాల వృద్ధి అత్యధికంగా 67 శాతం ఉన్నట్టు తెలిసింది. తన పోర్ట్‌ఫోలియో విస్తరించడంతో కంపెనీ మంచి లాభాలు పొందుతున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది.

ఒప్పో
గ్లోబల్ హ్యాండ్‌సెట్ లాభాల షేరులో ఒప్పో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఒక్కో యూనిట్‌కు 14 డాలర్ల లాభాన్ని ఒప్పో సంపాదిస్తోంది.

వివో
చైనా మంచి ప్రదర్శన కనబరుస్తున్న వివో, ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయక స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో ఐదవ స్థానంలో నిలిచింది. వివో ఒక్కో యూనిట్ లాభం 13 డాలర్లుగా ఉందని వెల్లడైంది.

షియోమి
ఈ ఏడాది మార్కెట్లోకి షియోమి భారీ లాభాలతోనే దూసుకొచ్చింది. అయితే షియోమి ఎక్కువగా లోయర్-ఎండ్ మోడల్స్‌నే విక్రయిస్తోంది.ఎంఐ మిక్స్ 2, ఎంఐ 6 సిరీస్ లాంటి ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌లపై ఎక్కువగా దృష్టిసారిస్తే మరింత లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్కో యూనిట్‌పై తక్కువగా 2 డాలర్ల ప్రాఫిట్ మాత్రమే వస్తుంది.


Click it and Unblock the Notifications








