వణికిస్తోన్న WannaCry, ఆ మెయిల్స్ జోలికి వెళ్లకండి

WannaCry, WanaCrypt0r 2.0, WannaCry, WCry పేర్లతో ఓ ప్రమాదకర రాన్సమ్‌వేర్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు 99 దేశాల్లోని లక్షలాది కంప్యూటర్లు ఈ వైరస్ ఉచ్చులో చిక్కుకున్నాయి.

Read More : MP3 పాటలు ఇక వినిపంచవు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ ఆధారిత కంప్యూటర్లే లక్ష్యంగా..

విండోస్ ఆధారిత కంప్యూటర్లే లక్ష్యంగా చెలరేగిపోతోన్న ఈ ప్రమాదకర వైరస్ ఒక్కసారి గనుక కంప్యూటర్‌లోకి చొరబడిందంటే, లోపలి ఫైల్స్ అన్నింటిని ఎన్‌క్రిప్ట్ చేసేస్తుంది.  ఆ తరువాత మీ కంప్యూటర్ మొత్తం అటాకర్స్ చెప్పుచేతుల్లోకి వెళ్లిపోతుంది.

300 డాలర్ల నగదును బిట్ కాయిన్స్ రూపంలో చెల్లిస్తేనే..

ఇక్కడి నుంచి ఓ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. 300 డాలర్ల నగదును బిట్ కాయిన్స్ రూపంలో చెల్లిస్తేనే కంప్యూటర్‌ను అన్‌లాక్ చేస్తామన్నది ఆ మెసేజ్ సారంశంగా ఉంటుంది. ఒకవేళ ఆ మొత్తం వాళ్లకు చెల్లించినా, లాక్ చేసిన డేటాను పూర్తిగా అన్‌లాక్ చేస్తారన్న గ్యారంటీ
ఉండదు. వాళ్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని నిర్ణీత గడువులోపు చెల్లించిన పక్షంలో డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది.

రాన్సమ్‌వేర్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు

వన్నాక్రై అనేది రాన్సమ్‌వేర్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, ఇది ఒక ప్రమాదక వైరస్ కూడా. ఈ ప్రోగ్రామ్ మీ కంప్యూటర్‌లోకి చొరబడటమే కాకుండా, మీ కంప్యూటర్ నుంచి ఇతర కంప్యూటర్‌లలోకి వ్యాపించాలని ప్రయత్నిస్తుంది.

ముఖ్యంగా ఈ-మెయిల్స్ ద్వారా..

వన్నాక్రై ప్రోగ్రామ్ అనేది ముఖ్యంగా ఈ-మెయిల్స్ ద్వారా కంప్యూటర్‌లలోకి చొరబడే ప్రమాదముంది. ముఖ్యంగా tasksche.exe ఫైల్ పేరుతో వచ్చే అటాచ్‌మెంట్‌లను అస్సలు ఓపెన్ చేయకండి.

ఈ సైబర్ దాడి వెనుక ఎవరున్నారు..?

ఈ దాడికి కారణమైన హ్యాకింగ్ టూల్‌ను యునైటెడ్ స్టేట్స్ నేషనల్ సెక్యూరిటీ ఏజేన్సీ అభివృద్ధి చేసిందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆరోపిస్తోంది. అంతకుమందుకు కూడా అమెరికా కేంద్ర నిఘా సంస్థ వేలకొద్ది హ్యాకింగ్ టూల్స్‌ను అభివృద్ధి చేసుకున్నట్లు వికిలీక్స్ రివీల్ చేసినట్లు మైక్రోసాఫ్ట్ ఈ సందర్భంగా గుర్తు చేసింది.

సిస్టమ్ బ్యాకప్స్‌తో రికవరీ..

మైక్రోసాఫ్ట్ చేసిన కామెంట్ల పై అటు అమెరికా కేంద్ర నిఘా సంస్థ కాని ఇటు వైట్‌హౌజ్ వర్గాలు కాని స్పందించలేదు. WannaCry రాన్సమ్‌వేర్ దాడికి గురైన చాలా వరకు కంప్యూటర్లు సిస్టమ్ బ్యాకప్స్‌తో రికవరీ పొందుతున్నాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

WannaCry మీ కంప్యూటర్‌లోకి చొరబడకుండా ఉండాలంటే..?

మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టం‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోండి. సెక్యూరిటీ అప్‌డేట్స్ నిత్యం ఇన్‌స్టాల్ చేస్తూనే ఉండండి. యాంటీ వైరస్‌ను అప్‌డేట్ చేసుకోండి. పీసీలోని డేటాను రెగ్యులర్‌గా బ్యాకప్ చేసుకోండి. అనుమానాస్పద ఈ-మెయిల్స్ పై క్లిక్ చేయకండి.

అనేక రకాలుగా మార్కెట్లో చలామణి

క్రిప్టోలాకర్, క్రిప్టోవాల్, లాకీ, సమాస్, సమ్‌సమ్, సమ్‌సా ఇలా అనేక పేర్లతో రాన్సమ్‌వేర్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. వీటిలో ప్రధానమైన క్రిప్టోలాకర్ అనే రాన్సమ్‌వేర్‌ను సెప్టంబర్ 5, 2013లో గుర్తించారు. ఈ రాన్సమ్‌వేర్‌‌ను ప్రధానంగా మైక్రోసాఫ్ట్ విండోస్ డివైస్‌లను టార్గెట్ చేస్తూ సైబర్ క్రిమినల్స్ తయారు చేసుకున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ransomware: What you need to know about this new cyber threat. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot