ఫుడ్ డెలివరీ కోసం ర్యాపిడో నుంచి కొత్త యాప్.. ఇక్కడే తొలి సర్వీసులు..!
Rapido Ownly App For Food Delivery : భారత్‌లో ఫుడ్ డెలివరీ రంగం క్రమంగా వృద్ధి చెందుతోంది. పట్టణాలు, నగర ప్రాంతాల్లో గణనీయంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. భారీ సంఖ్యలో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ రంగంలో జొమాటో, స్విగ్గీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే తాజాగా మరో ప్రముఖ సంస్థ ఈ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన యాప్‌ను లాంచ్ చేసింది.
ర్యాపిడో ఫుడ్ డెలివరీ యాప్ :
ప్రముఖ సంస్థ ర్యాపిడో బుధవారం ఫుడ్ డెలివరీల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. ర్యాపిడో ఓన్లీ (Rapido Ownly App) పేరుతో యాప్ ను విడుదల చేసింది. తొలి దశలో బెంగుళూరులో కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వీసులను టెస్టింగ్ చేయనుంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ విభాగంలో రాణిస్తున్న స్విగ్గీ, జొమాటో సంస్థలకు గట్టి పోటీనివ్వాలని ర్యాపిడో భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాంతాల్లో డెలివరీ :
ర్యాపిడో తన ఫుడ్ డెలివరీ సర్వీసుల కోసం Ctrlx టెక్నాలజీస్ పేరుతో అనుబంధ సంస్థలను ప్రారంభించింది. వ్యూహాత్మక్ నిర్ణయంలో భాగంగానే ఈ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని బైరసండ్ర, తవరేకేరీ, మడివాలా లేఅవుట్, హోసూర్ సర్జాపురా రోడ్, కోరమంగళ ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ సర్వీసులను టెస్టింగ్ చేయనుంది.
ఆ యాప్స్ కంటే 15 శాతం తక్కువ ధరకే :
ప్రస్తుతం ఈ విభాగంలో టాప్ లో ఉన్న స్వి్గ్గీ, జొమాటో కంటే సుమారు 15 శాతం తక్కువ ధరకు ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు చెబుతోంది. ర్యాపిడీ ఓన్లీ యాప్ రెస్టారెంట్స్ ను కమీషన్ కు బదులుగా కొంత మొత్తం వసూలు చేయనుంది. ప్రస్తుతం ఉన్న మిగిలిన సంస్థలు రెస్టారెంట్స్ నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను వసూలు చేస్తున్నాయి.
ర్యాపిడీ ఓన్లీ యాప్ ఎక్కడ అందుబాటులో ఉంది ? :
ప్రస్తుతం ర్యాపిడో ఓన్లీ యాప్ గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ర్యాపిడోలో 10 మిలియన్ వాహనాలున్నాయి. వీటినే డెలివరీ సర్వీసులకు కూడా ఉపయోగించాలని భావిస్తోంది. ధర, డెలివరీ సమయాన్ని ఆప్టిమైజ్ చేసేందుకు వీలుగా దూర ప్రాంతాలు కాకుండా సమీపంలోని ఆర్డర్లు మాత్రమే కనిపిస్తాయని తెలుస్తోంది.

ఈ సంవత్సరం నుంచి సేవలు ప్రారంభించింది :
స్విగ్గీతో కలిసి పనిచేసిన సమయంలో అనేక కీలక వివరాలను పొందింది. ఈ డేటాను తన కొత్త యాప్ కోసం ఉపయోగిస్తుంది. 2015 సంవత్సరంలో ర్యాపిడో తన క్యాబ్ బుకింగ్ సర్వీసు లను ప్రారంభించింది. ప్రస్తుతం 500 ప్రాంతాల్లో సేవలు అందిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ రెండు సంస్థల వాటా వివరాలు :
భారత్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ 2030 నాటికి 2 ట్రిలియన్ లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 58 శాతం వాటాతో జొమాటో అగ్రస్థానంలో ఉంది. అదే 42 శాతం వాటాతో స్విగ్గీ రెండో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications








