Ratan Tata ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై రతన్ టాటా ఏమన్నారు.. ఎలాంటి అంచనా వేశారు..?
రతన్ టాటా (Ratan Tata) అసలు పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా గత రాత్రి తుదిశ్వాస విడిచారు. 1937 డిసెంబర్ 28వ తేదీన జన్మించిన టాటా.. 2024 అక్టోబర్ 9 రాత్రి 11.30 గంటలకు ముంబయిలో తన 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు ఛైర్మన్ గా ఉన్నారు. ప్రపంచంలోని 100 దేశాల్లోని తన సంస్థలకు టాటా నేతృత్వం వహించారు.
వ్యాపారంతోపాటు దాతృత్వానికి పెద్దపీట వేసిన రతన్ టాటా.. అందుకోసం భారీగా విరాళాలు ఇచ్చారు. దీంతోపాటు వ్యాపార వ్యూహాలతోపాటు భవిష్యత్ లో టెక్నాలజీ ప్రభావం, పరిస్థితులను కూడా టాటా అంచనా వేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై (AI) ప్రభావంపై కొంత ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 7 సంవత్సరాల క్రితమే ఉద్యోగాలపై AI ప్రభావాన్ని అంచనా వేశారు.

AI (Artificial Intelligence), రోబోటిక్స్ వంటివి రంగాల అభివృద్ధి.. భవిష్యత్ లో మానవ ఉద్యోగాలను భర్తీ చేయగలదని రతన్ టాటా భావించారు. ఈ తరహా టెక్నాలజీ అనేక రంగాల్లో మానవ అవసరాన్ని తొలగిస్తుందని భావించారు. భవిష్యత్ లో వ్యాపారాలను ఎలా నిర్వహించాలో కూడా టెక్నాలజీ నిర్ణయిస్తుందని గతంలో టాటా గ్రూప్ పబ్లికేషన్ లో రతన్ టాటా పేర్కొన్నారు.
ప్రస్తుతం అనేక పరిశ్రమల్లో ఆటోమేషన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి ఈ మార్పులను మరింత ముందుకు తీసుకెళ్తుందని రతన్ టాటా అంగీకరించారు. ప్రస్తుత ఇంటెలిజెన్స్ యుగంలో అనేక సంస్థలు తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని టాటా బలంగా విశ్వసించారు. టాటా నేతృత్వంలోనే టాటా గ్రూప్ AI, రోబోటిక్స్ లోకి ప్రవేశించింది.
టెక్నాలజీ అభివృద్ధి పట్ల సానుకూలంగానే ఉన్న టాటా.. ఉద్యోగాలు సహా అనేక రంగాల్లో మానవ జోక్యంపై ఆ ప్రభావం చూపుతుందని గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆటోమేటెడ్ ప్రపంచంలో మానవ నైపుణ్యాలపై తరచూ ఆందోళన వ్యక్తం చేసేవారు. తన వ్యూహాలతో టాటా గ్రూప్‌ను దిగ్గజ సంస్థగా మార్చారు.. రతన్ టాటా.
ప్రస్తుతం టాటా సంస్థ (TCS) భాగస్వామ్యంతో BSNL 4G, 5G టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దేశీయంగానే 4G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో BSNL టాటాతో జతకట్టింది. ఫలితంగా శరవేగంగా టవర్ల ఏర్పాటు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా హై స్పీడ్ డేటా, నాణ్యమైన కాలింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా సంస్థ సాంకేతికంగా అండగా నిలిచింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications