కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబాని సౌధంపై రతన్ టాటా విమర్శల దుమారం

Posted By: Staff

కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబాని సౌధంపై రతన్ టాటా విమర్శల దుమారం

ముంబై: టాటా గ్రూపు చైర్మన్‌ రతన్‌టాటా లండన్‌ టైమ్స్‌ న్యూస్‌ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో .. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబాని బిలియన్‌ డా లర్ల విలువ గల భవంతిని నిర్మించి ఆ భవనంలో నివసిం చడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ భవనం పై నుంచి చుట్టుపక్కల చూస్తే.. వారి తనకు మధ్య గల వ్య త్యాసం తెలుస్తుంది. దేశంలో చాల మంది కడు పేదరికం తో అల్లాడుతుంటే మనం రాజభోగాలు అనుభవించడం భావ్యం కాదని.. లెక్కలేనంత సంపద సంపాదించిన వారు పేదరికంతో బాధపడుతున్న ప్రజలకు త మ సంపద పంచిపెట్టాలని అన్నారు. దేశంలో పెరిగిపోతు న్న ధనిక -పేదల మధ్య తారతమ్యం తనకు బాధ కలిగి స్తోందని టాటా చెప్పారు.

ఈ తారతమ్యం తగ్గించేందుకు మనం ఏ మాత్రం కృషి చేయడం లేదని ఆయన వాపో యారు. రతన్‌టాటా వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. అయతే టాటాసన్స్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారమే రతన్‌టాటా వ్యాఖ్యలు చేశారని..అవి నిజం కావచ్చు.. కాకపోవచ్చని కావాలని ఉద్దేశపూర్వకంగా ముఖేష్‌పైన వ్యాఖ్యలు చేయలేదని.. వార్తా పత్రిక కావాలని సంచలనం సృష్టించాలనే ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు జోడించిందని అన్నారు. అయితే దేశంలో ధనిక -పేద వర్గాల మధ్య పెరిగిపోతున్న అంతరాన్ని రతన్‌టాటా ఎత్తిచూపారని.. ప్రత్యేకంగా ముఖేష్‌పై వ్యాఖ్యానించలేదని అలానే ఈ వార్త ప్రచురించిన సంస్థకు కూడా తమ నిరసన తెలిపామని ఆ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting