Ray Ban Meta Glasses : మెటా రే బాన్ స్మార్ట్ గ్లాసెస్ విడుదల.. ఫీచర్‌లు, ధర, సేల్ పూర్తి వివరాలు..!
Ray Ban Meta Smart Glasses : టెక్ దిగ్గజం మెటా తాజాగా Ray Ban స్మార్ట్ గ్లాసెస్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ గ్లాసెస్ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉన్నాయి. ఈ మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో స్టైల్ తోపాటు టెక్నాలజీ ఫీచర్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.
12MP కెమెరా :
Ray Ban మెటా స్మార్ట్ గ్లాస్‌లు అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. 12MP అల్ట్రావైడ్ కెమెరాతోపాటు 5 మైక్రోఫోన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా అధిక నాణ్యతతో ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. ఈ ఫోటోలు, వీడియోలను నేరుగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేందుకు వీలుంటుందని మెటా చెబుతోంది.

ఈ స్మార్ట్ గ్లాస్‌సె ఫ్రేమ్‌ల వద్ద LED లైట్‌ను కూడా అమర్చి ఉంటుంది. ఈ లైట్ రికార్డింగ్ ఇండికేటర్‌గా కూడా వినియోగించుకోవచ్చు. మెటా వ్యూ యాప్ ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టా తోపాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లోనూ షేర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ గ్లాసెస్ IPX4 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ Ray Ban మెటా స్మార్ట్ గ్లాస్‌లు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ AR1 జెన్1 SoC తో పనిచేస్తాయి. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 32GB స్టోరేజీని జతచేసి ఉంటుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 4 గంటల వరకు వినియోగించుకోవచ్చు. అదే ఛార్జింగ్ కేస్ గరిష్ఠంగా 32 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

ఈ స్మార్ట్ గ్లాసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో ఇంటిగ్రేట్ చేశారు. దీంతో వాయిస్ కమాండ్స్ ద్వారా అనేక వివరాలు తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన సాంగ్ వివరాలను తెలుసుకోవాలి అనుకుంటే Hey Meta అనే వాయిస్ కమాండ్‌తో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ మెటా స్మార్ట్ గ్లాసెస్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. రియల్ టైంలో స్పీచ్ ట్రాన్స్‌లేషన్ కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొన్ని భాషలు మాత్రమే సపోర్టు చేయనున్నాయి. ఇందులో ఇంగ్లీష్, స్పానిష్, ప్రెంచ్, ఇటాలియన్ భాషలు మాత్రమే సపోర్టు చేస్తాయి. ఇందుకోసం Hey Meta Live Translation కమాండ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.
రే బాన్ మెటా గ్లాసెస్ ప్రారంభ ధర ధర రూ.29,900 గా ఉంది. షైనీ బ్లాక్ కలర్ వేరియంట్స్‌ను ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే మ్యాటీ బ్లాక్ వేరియంట్ ధర రూ.32,100 గా ఉంది. మరో వేరియంట్ ధర రూ.35,700 గా ఉంది. ఇవాళ్టి నుంచే ఈ మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. మే 19 నుంచి Ray-Ban.com సహా ఇతర స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.
రే బాన్ మెటా గ్లాసెస్ ద్వారా మ్యూజిక్‌ను కూడా ప్లే చేయవచ్చు. ఆపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, Spotify యాప్స్ ఇందుకు సపోర్టు చేస్తాయి. వాయిస్ టూ సెర్చ్ ద్వారా ఆల్బమ్, ప్లే లిస్ట్, సాంగ్ వంటి వివరాలు తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








