వన్‌ప్లస్ 5 కంటే శక్తివంతమైన ఫోన్ వస్తోంది!

అమెరికాకు చెందిన ప్రముఖ గేమింగ్ కంప్యూటర్ల తయారీ కంపెనీ Razer తన మొట్టమొదటి గేమింగ్ సెంట్రిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.

|

అమెరికాకు చెందిన ప్రముఖ గేమింగ్ కంప్యూటర్ల తయారీ కంపెనీ Razer తన మొట్టమొదటి గేమింగ్ సెంట్రిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. నవంబర్ 1న లాంచ్ కాబోతోన్న ఈ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్, ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ నోట్ 8, వన్‌ప్లస్ 5లతో పోలిస్తే శక్తివంతమైన పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుందని సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ అఫీషియల్‌గా రివీల్ కానప్పటికి, ప్రముఖ బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్ GFXBench పలు స్పెక్స్‌ను రివీల్ చేసింది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే...

 
Razer teases November 1 event, may launch its first-ever smartphone

Android Razer ఎడిషన్ ఫోన్ 5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 2560x 1440పిక్సల్స్, 5 ఫింగర్ గెస్ట్యర్ సపోర్ట్‌తో కూడిన అత్యాధునిక టచ్‌ స్ర్కీన్ వ్యవస్థను ఈ ఫోన్ సపోర్ట్ చేసింది.

ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ ఫోన్‌లో, శక్తివంతమైన 2.4GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సీపీయూ, క్వాల్కమ్ అడ్రినో 540 జీపీయూ, 8జీబి ర్యామ్, 64జీబి ఇంటర్సల్ స్టోరేజ్, 11 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (రిసల్యూషన్ క్వాలిటీ 4032 x 3024పిక్సల్స్) , 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (రిసల్యూషన్ క్వాలిటీ 3264 x 2448పిక్సల్స్), సింగిల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ, హార్ట్ రేట్ మానిటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.

 

Android Razer స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా భావిస్తోన్న వన్‌ప్లస్ 5 స్పెసిఫికేషన్స్..

5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్ 835 సాక్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ వత్ డాష్ ఛార్జ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ వీ5.0, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు వన్‌ప్లస్ 5లో ఉన్నాయి.

Android Razer స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా భావిస్తోన్న మరో ఫోన్ గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..

6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.

Best Mobiles in India

English summary
Razer teases November 1 event, may launch its first-ever smartphone. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X