ఇంటర్నెట్ అవసరం లేకుండా కొత్త UPI పేమెంట్ పద్ధతిని ప్రారంభించిన RBI

|

భారతీయ పౌరుల కోసం RBI కొత్త పేమెంట్ పద్ధతిని ప్రవేశపెట్టింది. అయితే ఈ పేమెంట్ పద్ధతికి ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. UPI ద్వారా పేమెంట్ చేయడం ఇప్పటికే USSD పద్ధతి ద్వారా అందుబాటులో ఉంది. అయితే ఈ కొత్త పేమెంట్ పద్ధతిని అనుసరించడం మరింత సులభం అవుతుంది. డిజిటల్ పేమెంట్ గురించిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కొత్త డిజిసాథీ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

UPI పేమెంట్

ఇండియాలో ఇప్పటికే దాదాపుగా 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వినియోగదారులను లక్ష్యంగా చేసుకోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్తరకం డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. NPCI ఈ కొత్త పద్ధతికి UPI పేమెంట్ కోసం 123Pay అని పేరును పెట్టింది. ఈ కొత్త పద్ధతి దేశవ్యాప్తంగా వినియోగదారులకు అనేక డిజిటల్ పేమెంట్ ఎంపికలను తెరుస్తుంది.

కొత్త సర్వీస్ కోసం నమోదు చేసుకోవడం ఎలా?

కొత్త సర్వీస్ కోసం నమోదు చేసుకోవడం ఎలా?

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ UPI లావాదేవీలను ఎలా యాక్టివేట్ చేస్తారో అదేవిధంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంటును వారి ఫీచర్ ఫోన్‌తో లింక్ చేయడానికి వారి బ్యాంక్ డెబిట్ కార్డ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. తరువాత వారు UPI పిన్ కోడ్‌ను కూడా సెట్ చేయాలి. అది పూర్తయిన తర్వాత వినియోగదారులు ఆర్థిక మరియు ఆర్థికేతర లావాదేవీలను నిర్వహించగలగడానికి కొత్త నాలుగు కొత్త ఎంపికలు ఉన్నాయి.

పేమెంట్ యొక్క కొత్త పద్ధతులు
 

పేమెంట్ యొక్క కొత్త పద్ధతులు

RBI కొత్తగా ప్రారంభించిన 123పే పేమెంట్ పద్ధతి ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఎలా పని చేస్తుందో డెప్చరీ ఆర్‌బిఐ గవర్నర్ టి రబీ శంకర్ లాంచ్ వేడుక సందర్భంగా వివరించారు.

UPI ఫోన్‌లలోని యాప్‌లు

స్మార్ట్‌ఫోన్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే ఇప్పుడు ఫీచర్ ఫోన్‌లు కూడా కొన్ని UPI యాప్‌లకు సపోర్ట్ చేస్తాయి. అయితే వాటి దరఖాస్తులకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. యాప్ ద్వారా పేమెంట్ చేసే విధానం స్మార్ట్‌ఫోన్‌లలోని జనాదరణ పొందిన UPI యాప్‌ల మాదిరిగానే అనుభవాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

 

IVR-ఆధారిత లేదా వాయిస్-ఆధారిత UPI పేమెంట్

IVR-ఆధారిత లేదా వాయిస్-ఆధారిత UPI పేమెంట్

ఈ పద్ధతిని యాక్సెస్ చేయడానికి వినియోగదారులు IVR నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ కాల్‌లో వినియోగదారున్ని ఆటోమేటెడ్ వాయిస్ సరైన ఎంపికకు మళ్లిస్తుంది. మీకు మనీ ట్రాన్స్‌ఫర్, LPG గ్యాస్ రీఫిల్, ఫాస్టాగ్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, EMI రీపేమెంట్ మరియు బ్యాలెన్స్ చెక్ వంటి ఎంపికలు ఉంటాయి. మీరు సరైన ఎంపికను నమోదు చేసి ఆపై మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న నంబర్‌ను ఎంచుకోవాలి. చివరి దశలో మీరు పంపాలనుకునే పేమెంట్ మొత్తం మరియు UPI పిన్‌ను నమోదు చేయాలి.

సౌండ్ ఆధారిత పేమెంట్

సౌండ్ ఆధారిత పేమెంట్

ఈ రకమైన పద్దతి అనేది ఇప్పటివరకు పేమెంట్ విబాగంలో దాదాపుగా వినని పద్ధతి. అంటే ఫీచర్ ఫోన్‌లు ధ్వని తరంగాలను ఉపయోగించి డబ్బును బదిలీ చేస్తాయి. డెమో వీడియోలో రిసీవర్‌గా పని చేయగల చిన్న స్మార్ట్ స్పీకర్ లాంటి పరికరాన్ని RBI చూపిస్తుంది. వినియోగదారు తమ UPI పిన్‌ని నమోదు చేసిన తర్వాత పేమెంట్ చేయడానికి మెషీన్‌పై నొక్కాలి.

మిస్డ్ కాల్ ఆధారిత లావాదేవీ

మిస్డ్ కాల్ ఆధారిత లావాదేవీ

మిస్డ్ కాల్ పద్ధతిలో కూడా పేమెంట్ చేయడానికి ఇప్పుడు ఒక కొత్త ఎంపిక అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో మీరు వివిధ ఆర్థిక మరియు ఆర్థికేతర లావాదేవీలను చేయడానికి మిస్డ్ కాల్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ పద్ధతి IVR-ఆధారిత సాంకేతికతను పోలి ఉంటుంది.

Best Mobiles in India

English summary
RBI Launches UPI Payment Method Without Internet Requirement

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X