Home
News

EMI కట్టలేకపోతే స్మార్ట్‌ఫోన్‌ Lock కానుందా.. దీని వెనకున్న కారణాలు ఏంటి?

ఫీచర్‌ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్‌లను గతంలో డబ్బులు ఉంటేనే కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపేవారు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి EMI ల రూపంలో కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో EMI ల రూపంలో భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. 6 నెలలు లేదా 9, 12 నెలల వరకు కూడా కొన్ని సంస్థలు నో కాస్ట్ EMI సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌లు జీరో డౌన్‌ పేమెంట్‌ ఆప్షన్‌ ను కూడా అందిస్తున్నాయి. ఫలితంగా చాలా మంది చేతిలో కనీస నగదు లేకపోయినా EMI ఆప్షన్‌ లో ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు.

RBI కొత్త ప్రతిపాదన! :
EMI రూపంలో ఫోన్‌లు కొనుగోలు ప్రస్తుతం భారీగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ అంతా సాఫీగా సాగుతోంది. అయితే RBI కొత్త ప్రతిపాదన, కాస్త అమల్లోకి వస్తే, కొంత మందికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త నిబంధనలను ఎందుకు తీసుకురావాలని భావిస్తోందో తెలుసుకుందాం.

Banks and other financial organizations may lock your smartphone if you miss monthly installment

స్మార్ట్‌ఫోన్ లాక్‌ అవుతుంది! :
ప్రస్తుతం దేశంలో క్రెడిట్‌ సహా ఇతర కార్డులతో రూపాల్లో EMI ఆప్షన్‌ లో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే సకాలంలో EMI చెల్లింపులు చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. అయితే EMI చెల్లింపులు చేయలేకుంటే మాత్రం మీ స్మార్ట్‌ఫోన్‌ లాక్‌ కానుంది.

డిఫాల్ట్ కేసులు పెరుగుతున్నందుకేనా :
EMI సకాలంలో చెల్లింపులు చేయలేకపోతే ఫోన్‌ను బ్లాక్‌ చేసే కొత్త నిబంధనను తీసుకొచ్చేందుకు RBI పరిశీలన చేస్తోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇలాంటి చెల్లింపులు క్రమంగా డిఫాల్ట్‌ అవుతున్నాయని, అందువల్లే ఈ ప్రతిపాదనలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా పరిశీలన చేస్తోందని తెలుస్తోంది.

వ్యక్తిగత డేటా లీక్‌ కాకుండా :
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు స్మార్ట్‌ఫోన్‌ను లాక్‌ చేసే అధికారం ఇస్తారని తెలుస్తోంది. అయితే స్మార్ట్‌ఫోన్‌ను లాక్‌ చేసే ముందు యూజర్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఫలితంగా మీ వ్యక్తిగత సమాచారం లీక్ కావడం వంటివి జరగవని తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌ లాక్‌ చేసిన అనంతరం యూజర్ వ్యక్తిగత సమాచారం ఇతరులు యాక్సెస్‌ చేసేందుకు అవకాశం ఉండదు. మరియు స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఉపయోగించలేరు. అయితే ఈ ఇవి కేవలం ప్రతిపాదనలను మాత్రమేనని, RBI ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

EMI ఆప్షన్‌ లో కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్‌లకు సకాలంలో నెలవారీ చెల్లింపులు చేయలేని సందర్భాల్లో.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతోందనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. మరియు డిఫాల్ట్‌ కేసులు కూడా నమోదవుతున్నాయని సమాచారం. వీటిని కట్టడి చేసేందుకే ఈ ప్రతిపాదనను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన EMI చెల్లింపులు పూర్తి చేసిన అనంతరం, ఫోన్‌ తిరిగి అన్‌లాక్‌ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే దీని ద్వారా EMI చెల్లింపుల భారం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
RBI New Proposal smartphone may lock if fails to pay monthly installments, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X