Home
News

క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టడానికి RBI కొత్త రూల్స్! ఇకపై CRED, PhonePe వంటి యాప్ లు పనిచేయవు 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించి జూలై 1 నుండి కొత్త రూల్స్ ను తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం, థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా జరిగే అన్ని చెల్లింపులు ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారా జరగాలి.

ఒకవేళ మీ బ్యాంక్ ఇంకా BBPS తో అనుసంధానం కానట్లయితే, బిల్లుల సెటిల్‌మెంట్ల కోసం CRED, PhonePe, Amazon Pay మరియు Paytm వంటి యాప్‌లను క్రెడిట్ కార్డు బిల్లులు పే చేయడానికి మీరు ఉపయోగించలేరు. ఇది ప్రధాన బ్యాంకుల కస్టమర్‌లపై ప్రభావం చూపుతుంది.

RBI New Rules For Credit Card Payments

ఈ కొత్త రూల్స్ భద్రతను మెరుగుపరచడం మరియు క్రెడిట్ కార్డ్ చెల్లింపు ప్రక్రియలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా తీసుకువచ్చినట్లు RBI ప్రకటించింది.

ఈ కొత్త రూల్స్ కారణం గా ఎలాంటి ప్రభావం ఉండబోతోంది?
ప్రముఖ బ్యాంకులు HDFC, ICICI బ్యాంక్, సిటీ బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల కస్టమర్‌లు ఇకపై CRED, PhonePe, Amazon Pay మరియు Paytm వంటి ప్రముఖ థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించలేరు. ఈ బ్యాంకుల యొక్క యాప్‌లు ఇంకా BBPSతో అనుసంధానం కాలేదు.

మరి క్రెడిట్ కార్డు బిల్లులు ఎలా పే చేయాలి?
బ్యాంకుల యొక్క అధికారిక నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా మొబైల్ యాప్‌ల వంటి ద్వారా బిల్లులు చెల్లింపుల కోసం కస్టమర్‌లు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాల్సి ఉంటుంది. మరియు, ఫిజికల్ బ్యాంక్ శాఖల ద్వారా అంటే నేరుగా బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లి బిల్లు చెల్లింపులు చేయడం ఇప్పటికీ కొన్ని సంస్థలకు ఒక ఆప్షన్ గా ఉంది.

ఫిన్‌టెక్ రంగం లో ఇది భారీ మార్పు, వినియోగదారులు అంతరాయం ఎదుర్కొంటారు.
ప్రముఖ యాప్ లు Cred, PhonePe మరియు BillDesk వంటి ఫిన్‌టెక్ కంపెనీలు BBPS వైపు మారడం వల్ల గణనీయమైన అంతరాయాన్ని ఎదుర్కోవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు జరపాలంటే ఈ కంపెనీలు BBPSతో అనుసంధానం కావాలి.

Google Pay మరియు ఇతర యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపు యాప్‌లు త్వరలో భారతదేశంలోని వినియోగదారులకు ఇప్పుడు ఉన్నట్లు అన్ లిమిటెడ్ ట్రాన్సాక్షన్ లను చేయడానికి అనుమతించవు.

రిపోర్ట్ ల ప్రకారం, UPI డిజిటల్ సిస్టమ్‌కు బాధ్యత వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్‌ల కోసం వాల్యూమ్ క్యాప్‌ను తగ్గించడానికి డిసెంబర్ 31 ని గడువు గా అమలులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్‌తో సహకరిస్తోంది.అని నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డులు బిల్లులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
RBI New Rules For Credit Card Payments, Cred,PhonePe Apps Cannot Be Used For Payments. New Changes Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X