Paytm పేమెంట్స్ బ్యాంక్‌కు RBI షాక్.. ఈ సేవలపై కీలక ఆంక్షలు!!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ( Paytm ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించడం లేదనే కారణంగా డిపాజిట్లు తీసుకోవడం, క్రెడిట్ ట్రాన్సాక్షన్‌లు చేపట్టకూడదని ఆదేశించింది. ఫిబ్రవరి 29 తర్వాత వాలెట్స్, ఫాస్ట్‌ట్యాగ్, ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్లు, టాప్-అప్‌లు నిలిచిపోనున్నాయి. దీంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.
నిబంధనల ఉల్లంఘనే కారణమా: పలు ఆడిట్ నివేదికల ఆధారంగా బ్యాంకులో అనేక ఉల్లంఘనలను గుర్తించామని ఫలితంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటిడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ నోడల్ అకౌంట్లను రద్దు చేస్తున్నట్లు RBI పేర్కొంది.

వీటిపై ఎలాంటి ఆంక్షలు లేవు : అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు తన నగదును వినియోగించుకొనేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. అంటే పేమెంట్స్ బ్యాంకులోని కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్, నేషనల్ మొబిలిటీ కార్టు, ఫాస్టాగ్ సహా ఇతర నగదును విత్‌డ్రా సహా వినియోగించుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించింది. దీంతోపాటు రిఫండ్లు, క్యాష్‌బ్యాక్, వడ్డీపై ఆంక్షలు లేవని పేర్కొంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్‌పై నిషేధానికి ఇదే కారణమా : పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్.. మానిటరీ పాలసీలు, ఇతర నిబంధనలు, మార్గదర్శకాలను పాటించని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. 2022 సంవత్సరంలోనూ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్‌పై RBI చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

భారీగా కుప్పకూలిన షేర్లు : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై ఆర్‌బీఐ చర్యలు అనంతరం ఆ సంస్థ షేర్‌లు భారీగా కుప్పకూలాయి. ఆరు వారాల కనిష్టానికి పడిపోయాయి. 20 శాతం షేర్లు కుప్పకూలాయి. అయితే ఆర్‌బీఐ ఆదేశాలు పేటీఎం UPI పేమెంట్లపై ఎలాంటి ప్రభావం చూపవని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అయితే తాజా ఘటనపై పేటీఎం బ్యాంకు అధికారికంగా స్పందించలేదు.
దీనివల్ల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యూజర్లపై ఎటువంటి ప్రభావం చూపుతుంది : 2023 మార్చి చివరినాటికి పేటీఎం ప్రపంచవ్యాప్తంగా తన వివిధ యూనిట్లలో సరాసరి 32,798 మంది సిబ్బందిని మరియు 1589 మంది కాంట్రాక్టు ఉద్యోగులను కలిగి ఉన్నట్లు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అయితే ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి పేటీఎం యూజర్లకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications