రూ. 70కే ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ డేటా, ఈ రోజే ఆఖరి రోజు

Written By:

రిలయన్స్ జియోకి ఆర్ కామ్ గట్టిపోటీనిస్తూ వస్తోంది. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.70 తో రీఛార్జ్ చేసుకున్న వారికి ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ 2 జీ డేటా అందించడంతోపాటు, రూ.56 టాక్‌టైమ్ కూడా అందించనున్నట్లు ఆర్‌కామ్ ప్రకటించింది. 'డేటా కి ఆజాదీ' ఆఫర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ ఆగస్టు 14 నుంచి ఆగస్టు 16 వరకు మాత్రమే వర్తించనుంది. ఈ మూడు రోజుల్లో రీఛార్జి చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆర్‌కామ్ వెల్లడించింది.

జియో నుంచి మరో సూపర్ ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ జియో దెబ్బకు కంపెనీ విలవిల

ఇదిలా ఉంటే అనిల్ అంబానీకి చెందిన టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ నష్టాలను మూటగట్టుకున్నది. తన అన్న ముకేశ్ అంబానీకి చెందిన టెలికం వెంచర్ రిలయన్స్ జియో దెబ్బకు కంపెనీ విలవిలలాడింది

ఆర్‌కామ్ రూ.45 వేల కోట్ల స్థాయిలో అప్పు

జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.1,210 కోట్ల నష్టాన్ని చవిచూసింది. జియో ప్రకటించిన టారిఫ్‌ల దెబ్బకు గడిచిన మూడు త్రైమాసికాలుగా నష్టాలనే ప్రకటించింది. ప్రస్తుతం ఆర్‌కామ్ రూ.45 వేల కోట్ల స్థాయిలో అప్పు ఉంది.

2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి

2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సంస్థ రూ.90 కోట్ల లాభాన్ని గడించింది. టెలికం రంగంలో నెలకొన్న పోటీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ రంగంలో నిస్తేజం నెలకొననున్నదని ఆర్‌కామ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఏడాది ప్రాతిపదికన 33 శాతం క్షీణించి

ఆదాయం విషయానికి వస్తే ఏడాది ప్రాతిపదికన 33 శాతం క్షీణించి రూ.3,591 కోట్లకు పరిమితమైనట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది రూ.5,361 కోట్లుగా ఉంది.

గడిచిన 20 ఏండ్లలో

గడిచిన 20 ఏండ్లలో తొలిసారిగా టెలికం రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయని, నిర్వహణ మార్జిన్లు తగ్గుముఖం పట్టడం, వడ్డీల కోసం అధికంగా నిధులు కేటాయించాల్సి రావడం, తరుగుదల అధికంగా ఉండటం, రుణ విమోచన చార్జీలు అధికమవడం, స్పెక్ట్రం కొనుగోలుకు అధిక స్థాయిలో నిధులు వెచ్చించడంతో ఈ రంగంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనుందని కంపెనీ పేర్కొంది.

ఎనిమిది సర్కిళ్లకు సంబంధించి

ఈ నెల చివరినాటికి సిస్టమా శ్యామ్ టెలికం విలీన ప్రక్రియ పూర్తికానున్నదని సంస్థ అంచనావేస్తున్నది. విలీనం పూర్తయిన తర్వాత ఎనిమిది సర్కిళ్లకు సంబంధించి 30 మెగాహెడ్జ్ స్పెక్ట్రం కంపెనీ వశమవనున్నది. ఈ స్పెక్ట్రం కాలపరిమితి 2033 వరకు ఉన్నది.

ఎయిర్‌సెల్ విలీనమవనుండటంతో

ఆర్‌కామ్‌లో ఎయిర్‌సెల్ విలీనమవనుండటంతో కంపెనీ అప్పు రూ.14 వేల కోట్లు తగ్గనున్నది. రుణాలను తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ..టవర్ల బిజినెస్ బూక్‌ఫిల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో వాటాను విక్రయించడం ద్వారా రూ.11 వేల కోట్లు రావచ్చునని అంచనావేస్తున్నది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
RCom Gives Unlimited 2G Data For 365 Days; Heres How To Get It Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot